Devil : నందమూరి కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రమోషన్స్ లో మొదలుపెట్టి టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాని నవంబర్ 24న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. కానీ ఆ సమయానికి రిలీజ్ చేయలేకపోయారు. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఈ మూవీని పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేశారు.
ఈ పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీని డిసెంబర్ 29న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కి వారం ముందు ప్రభాస్ ‘సలార్’ మూవీ విడుదల ఉన్న సంగతి తెలిసిందే. మరి భారీ హైప్ ఉన్న సలార్ తో పాటు వస్తున్న డెవిల్ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి. హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Also read : Bigg Boss 7 Day 95 : ఈ వీక్ నేనే ఎలిమినేట్ అయ్యేది.. వెళ్లేముందు శివాజీ గురించి బయటపెడతా.. శోభాశెట్టి
The British’s best-kept secret agent story, #DevilTheMovie, is about to be all yours on December 29th!
Spytacular entertainment awaits you!#DevilOnDec29th #Devil – The British Secret Agent
డెవిల్ – डेविल – டெவில் – ಡೆವಿಲ್ – ഡെവിൽ@NANDAMURIKALYAN @iamsamyuktha_… pic.twitter.com/bwh9tYmrHx— ABHISHEK PICTURES (@AbhishekPicture) December 7, 2023
ఇది ఇలా ఉంటే, డెవిల్ దర్శకనిర్మాతల మధ్య వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాని కొత్త దర్శకుడు నవీన్ డైరెక్ట్ చేస్తున్నట్లు గతంలో తెలియజేశారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ లో దర్శకుడిగా నవీన్ పేరునే వేశారు. కానీ ఇటీవల సాంగ్స్ రిలీజ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి.. నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా కూడా తన పేరునే వేసుకుంటున్నారు. ఇక ఈ విషయం దర్శకుడు నవీన్ ఇన్‌డైరెక్ట్ గా రియాక్ట్ అవుతూ తన ట్విట్టర్లో.. “వినాశకాలే విపరీత బుద్ధి” అంటూ గతంలో ఒక ట్వీట్ చేశారు. అయితే అసలు దర్శకనిర్మాతల మధ్య ఏమి జరిగిందో అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.