×
Ad

Kamakshi Bhaskarla: కామాక్షి వింత అలవాటు: ప్రశాంతత కోసం స్మశానానికి వెళుతుందట.. అక్కడికి వెళ్లి..

మనలో చాలా మందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి. ఒకరికి నచ్చిన అలవాట్లు మరొకరికి వింతగా అనిపిస్తాయి(Kamakshi Bhaskarla). మరికొంత మంది అలవాట్లు వింతకే వింత అనిపించేలా ఉంటాయి.

Kamakshi Bhaskar's strange habit_ going to the cemetery for peace.

Kamakshi Bhaskarla: మనలో చాలా మందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి. ఒకరికి నచ్చిన అలవాట్లు మరొకరికి వింతగా అనిపిస్తాయి. మరికొంత మంది అలవాట్లు వింతకే వింత అనిపించేలా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక వింత అలవాటే టాలీవుడ్ బ్యూటీకి ఉందట. ఆ బ్యూటీ మరెవరో కాదు కామాక్షి భాస్కర్ల. ఈ బ్యూటీ గురించి చాలా మందికి తెలియక పోవచ్చు కానీ, ఆమె నటించిన సినిమాల గురించి మాత్రం అస్సలు మర్చిపోరు. అలాంటి ఒక సినిమానే(Kamakshi Bhaskarla) పొలిమేర. ఈ సినిమాలో గెటప్ శ్రీను భార్యగా నటించింది కామాక్షి భాస్కర్ల. ఈ సినిమా చూసిన వారేవ్వరు ఆమెను మర్చిపోలేరు. తన నటనతో ఆడియన్స్ ని ఒక రేంజ్ లో భయపెట్టేసింది ఈ బ్యూటీ.

Sachin-Sujeeth: సుజీత్ డైరెక్షన్ లో సచిన్ టెండూల్కర్.. వైరల్ అవుతున్న ఫోటోస్

అయితే, పొలిమేర సినిమాలో డీగ్లామర్ గా కనిపించినా గ్లామర్ షో చేయడంలో ఈ అమ్మడు నెక్స్ట్ లెవల్. పొట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ’12ఎ రైల్వే కాలనీ’ సినిమాలో నటిస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ఈ సినిమా కూడా ఒక థ్రిల్లర్ అవడం విశేషం. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ బ్యూటీ.. సినిమా గురించి అలాగే తనకున్న ప్రత్యేకమైన అలవాటు గురించి చెప్పి ఆడియన్స్ కు షాకిచ్చింది. అదేంటంటే, ఈ అమ్మడు మనసు బాలేనపుడు స్మశానానికి వెళుతుందట.

అక్కడికి వెళితే ఎదో తెలియని ప్రశాంతత దొరుకుతుందని చెప్పింది. “నాకు లో గా, డిప్రషన్ గా అనిపించినప్పుడు స్మశానానికి వెళ్తూ ఉంటాను. అక్కడికి వెళితే, బూస్ట్ అప్ అవుతాను, మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు అంతా అవాక్కయ్యారు. అలాగే ఆడియన్స్ కూడా ఆమె చెప్పిన సమాధానంకి రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.