Sachin-Sujeeth: సుజీత్ డైరెక్షన్ లో సచిన్ టెండూల్కర్.. వైరల్ అవుతున్న ఫోటోస్
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఇటీవల ఓజీ సినిమా చేసిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్(Sachin-Sujeeth) కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
OG movie director Sujeeth shoots an add with Sachin Tendulkar
Sachin-Sujeeth: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఇటీవల ఓజీ సినిమా చేసిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన సుజీత్ తన ఫేవరేట్ హీరోని ఎలా చూడాలనుకుంటున్నాడో ఆలా చూపించి(Sachin-Sujeeth) అదిరిపోయే సక్సెస్ సాధించాడు. మొదటిరోజు రూ.154 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా రూ.330 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే, తాజాగా మరో స్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సుజీత్. ఆ స్టార్ సినిమా స్టార్ కాదు.. క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్.
Vijay-Rashmika: నువ్వు గర్వపడతావ్.. విజయ్ పై ప్రేమ వర్షం కురిపించిన రష్మిక..
రీసెంట్ గా ఒక యాడ్ షూట్ కోసం సచిన్ టెండూల్కర్ ను డైరెక్ట్ చేశారు ఈ కుర్ర దర్శకుడు. తాజాగా ఈ యాడ్ షూట్ జరిగినట్లు సమాచారం. ఈ సందర్బంగా షూట్ లో సచిన్ కి సీన్ వివరిస్తున్న ఫోటోలను సుజీత్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో అద్భుతమైన క్షణాలు”అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు సైతం సుజీత్ అన్నా నువ్వు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సుజీత్ సినిమాల విషయానికి వస్తే, ఓజీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమయ్యింది. బ్లడీ రోమియో అనే టైటిల్ ను ఈ సినిమాకు అనుకుంటున్నారు మేకర్స్. కానీ, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో త ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే సుజీత్ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ అందించనున్నాడు.
