Kamal Haasan and Suriya pics goes viral kamal haasan kissed suriya
Kamal – Suriya : గత సంవత్సరం విక్రమ్(Vikram) సినిమాతో కమల్ హాసన్(Kamal Haasan) గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి(Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్(Fahad Faasil), సూర్య(Suriya) ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ ని తీసుకొచ్చింది. ఈ సినిమా ఆ హీరోల ఫ్యాన్స్ అందరికి గుర్తుండిపోయేలా నిలిచింది.
ముఖ్యంగా చివర్లో రోలెక్స్ పాత్రలో సూర్య ఇచ్చిన ఎంట్రీ అయితే థియేటర్స్ లో అదిరిపోయింది. ఇప్పటికే ఈ సినిమాపై, ఇందులో హీరోలపై కమల్ హాసన్ అందర్నీ స్పెషల్ గా అభినందించారు కూడా. తాజాగా చెన్నైలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యకు కమల్ హాసన్ అవార్డు అందచేశారు.
NTR 30 : వస్తున్నా అంటూ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్పెషల్ పోస్ట్ .. మొదలుపెట్టిన ఎన్టీఆర్ 30 షూట్..
సూర్యకు అవార్డు అందించిన అనంతరం కమల్ హాసన్ మాట్లాడుతూ.. రోలెక్స్ పాత్ర ద్వారే మా సినిమా ఇంకా ఎక్కువ మందికి చేరువైంది. ఆ పాత్రని ఒప్పుకున్నందుకు సూర్యకు మరోసారి ధన్యవాదాలు. మేము చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకొని ఒక్క ఫోన్ చేసి సూర్యని అడగ్గానే చేస్తా అన్నాడు అని తెలిపారు. అనంతరం సూర్యని దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దిచ్చారు కమల్. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోలెక్స్ ని, విక్రమ్ ని ఒకే స్టేజి మీద ఇలా చూడటం బాగుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.