పోలీసులు వేధిస్తున్నారంటూ కోర్టుకు కమల్..

తమిళనాడు పోలీసులు తనను వేధిస్తున్నారంటూ విశ్వనటుడు కమల్ హాసన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు..

  • Publish Date - March 17, 2020 / 11:40 AM IST

తమిళనాడు పోలీసులు తనను వేధిస్తున్నారంటూ విశ్వనటుడు కమల్ హాసన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు..

తమిళనాడు పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ విశ్వనటుడు కమల్ హాసన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం హైకోర్టులో అత్యవసర పటిషన్‌​ దాఖలు చేశారు. కమల్‌ హాసన్‌ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఇండియన్‌-2’ (భారతీయుడు 2) చిత్ర షూటింగ్‌ సందర్భంగా చెన్నైలో ఇటీవల ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో ముగ్గురు టెక్నీషియన్స్ మృతి చెందగా.. 10 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించి పోలీసుల విచారణ తీరు అభ్యంతరకరంగా ఉందని, ప్రమాదాన్ని నటించి చూపించమంటూ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

కమల్‌ పిటిషన్‌ను అత్యవసర విచారణకు మద్రాస్‌ హైకోర్టు స్వీకరించింది. సిద్ధార్ధ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ తదితరులు నటిస్తున్న ‘ఇండియన్ -2’ సినిమాను లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది.

Read Also : సునిషిత్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

ట్రెండింగ్ వార్తలు