డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్(kamal haasan) కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం భారతీయుడు-2(#Indian2). ఈ
డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్(kamal haasan) కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం భారతీయుడు-2(#Indian2). ఈ మూవీ షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం(ఫిబ్రవరి 19,2020) రాత్రి షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో డైరెక్టర్ శంకర్ కూడా ఉన్నారు. శంకర్ కాలు బోన్ ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో శంకర్‌తో పాటు గాయపడ్డవారికి చెన్నైలోని సవిత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చెన్నై శివార్లలోని పూనమల్లి(poonamalle) దగ్గరున్న ఈవీపీ ఫిల్మ్ సిటీ(EVP Film City) స్టూడియోలో ఇండియన్ 2(#Indian2) మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇందుకోసం భారీ సెట్లు వేస్తున్నారు. 150 అడుగుల ఎత్తున్న క్రేన్ ఉపయోగిస్తున్నారు. అది విరిగి పడటంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు(28), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్(60) ఉన్నారు. గాయపడ్డవారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
సెట్స్‌లో జరిగిన ప్రమాదంపై.. హీరో కమల్‌హాసన్ ట్విటర్‌లో స్పందించారు. ఈ ప్రమాదం అత్యంత భయానకమైనదన్నారు. ఈ ఘటన తనని కలిచివేసిందన్నారు. ముగ్గురు స్నేహితులను కోల్పోవడం బాధాకరమన్నారు. తన బాధ కన్నా.. వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువ అంటూ ట్వీట్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఒకరిగా వారి కష్టాల్లో పాల్గొంటానని చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు కమల్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రోబో 2.0 తర్వాత డైరెక్టర్ శంకర్.. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమల్‌హాసన్, సిద్ధార్థ, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాష్‌కరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ 30 శాతం పూర్తయింది. శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ గా ఈ మూవీ నిలిచింది. దానికి సీక్వెల్ గా ఇండియన్2 తీస్తున్నారు. ఊహించని ఈ ఘోర ప్రమాదం భారతీయ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.
எத்தனையோ விபத்துக்களை சந்தித்து, கடந்திருந்தாலும் இன்றைய விபத்து மிகக் கொடூரமானது. மூன்று சகாக்களை இழந்து நிற்கிறேன்.எனது வலியை விட
அவர்களை இழந்த குடும்பத்தினரின் துயரம் பன்மடங்கு இருக்கும். அவர்களில் ஒருவனாக அவர்களின் துயரத்தில் பங்கேற்கிறேன்.அவர்களுக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள்— Kamal Haasan (@ikamalhaasan) February 19, 2020
#Indian2 mishap: 3 dead & 9 injured in the crane accident. The injured have been taken to a nearby hospital. Director Shankar is unhurt. pic.twitter.com/62Ux5Bav53
— Shabbir Ahmed (@Ahmedshabbir20) February 19, 2020