Kamal Haasan: 20 రోజులకే రూ.150 కోట్లు.. ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్.. కమల్ సరికొత్త రికార్డ్
కల్కి సినిమా కోసం ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యురేషన్ తీసుకుంటున్న కమల్ హాసన్(Kamal Haasan).
- V Santhosh Kumar
- Published On : March 9, 2026 / 06:31 PM IST
Kamal Haasan receiving highest remuneration in India for Kalki movie
- కల్కి 2 కోసం కమల్ కి భారీ రెమ్యునరేషన్
- 25 రోజులకి రూ.150 కోట్లు
- ఇండియాలో ఇదే హైయ్యెస్ట్ కావడం విశేషం
Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ గురించి, ఆయన సినిమాల గురించి, ఆయనకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఓపక్క హీరోగా సినిమాలు చేస్తూనే, మరోపక్క స్పెషల్ రోల్స్ కూడా చేస్తున్నాడు కమల్ హాసన్. వాటిలో కల్కి 2898 ఏడీ మూవీ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు.
2024లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సినిమాలో కమల్ హాసన్(Kamal Haasan) సుప్రీమ్ యాస్మిన్ పాత్రలో కనిపించి ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించాడు. అది సినిమాలో విలన్ పాత్ర కావడం విశేషం. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు కల్కి 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ల మధ్య ఉండే సీన్స్ తో సెకండ్ పార్ట్ షూటింగ్ ను స్టార్ట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
Bellamkond Sreenivas: కాబోయే భార్యతో బెల్లంకొండ శ్రీనివాస్.. లవ్లీ ఫొటోస్ షేర్ చేసిన హీరో
అయితే, కల్కి 2 సినిమా కోసం కమల్ హాసన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే, కల్కి 2 షూటింగ్ కేవలం 25 రోజులు మాత్రమే ఇచ్చాడట కమల్ హాసన్. అందుకోసం ఒక్కొరోజుకి రూ.6 కోట్ల చొప్పున 25 రోజులకు గాను రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట కమల్ హాసన్. కేవలం 25 రోజులకు రూ.150 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇది ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అవడం విశేషం. ఇంతవరకు ఏ స్టార్ హీరో కూడా ఇంత తక్కువరోజులకి రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం జరగలేదు. అలా, హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకోవడంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు కమల్ హాసన్. ఇండియా లెవల్లో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. కమల్ హాసన్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.
