దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ఓ లఘుచిత్రం 2020 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. లఘుచిత్రం పేరు కమలి. అట్లాంటా ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపికైన ‘కమలి’ ఆస్కార్‌కు పంపిన చిత్రాలలో షార్ట్ లిస్ట్ చేయగా ఈ చిత్రం నామినేట్ అయింది. ఇది తమిళనాడులో జరిగిన నిజమైన కథను ఆధారంగా తీసుకుని తీసిన అఘుచిత్రం.
చెన్నై శివారులోని మహాబలిపురం సుగంధి అనే అనే ఆమెకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు కమలి, హరీష్. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భర్త పిల్లలను తీసుకుని బయటకు వచ్చేస్తుంది. చదువు లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడుతుంది. పిల్లలను చదివించేందుకు బీచ్‌లో చేపల వేపుడు, మసాలా పౌడర్లు తయారుచేసి అమ్ముతుంది. ఎవరైనా స్కేటింగ్ చేస్తుంటే కూతురు కమలి ఆనందంగా చప్పట్లు కొడుతూ.. స్కేటింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించేది. సుగంధి కూతురికి ఎలాగైనా వాటిలో శిక్షణ ఇప్పించాలని అనుకుంటుంది. సర్ఫర్ వేలు అనే వ్యక్తి వద్ద స్కేట్ బోర్డింగ్ నేర్చుకుంటుంది కమలి.
సుగంధి ఆ బోర్డు కొనడానికి ఎంతో కష్టపడింది. నేర్చుకున్న కొద్దిరోజుల్లోనే బీచ్‌లో పడవల అంచుల నుంచి జాలర్ల కాలనీలో చక్రంలా తిరిగేసేది కమలి. ఆ బీచ్‌కు వచ్చే పర్యాటకులు మెచ్చుకునేవాళ్లు. అలా పలు ప్రదర్శనలకు కూడా వెళ్లేది. తరువాత సర్ఫింగ్ కూడా నేర్చుకుంది. ప్రపంచ ప్రఖ్యాత స్కేటర్ జామీ థామస్ చెన్నైలో ఓ కార్యక్రమానికి వచ్చినప్పుడు కమలి స్కేట్‌బోర్డింగ్ చూసి, ఆమెతో కలిసి సర్ఫింగ్ చేశాడు. నైపుణ్యాలు నేర్పాడు.
ఓ వైపు చదువుకుంటూనే పోటీలకు వెళ్తుంది కమలి. న్యూజిలాండ్‌కు చెందిన లఘుచిత్రాల దర్శకుడు సాషా రెయిన్‌బో కమలిని చూసి ఆమె కథనే లఘుచిత్రంగా తీశాడు. అ చిత్రమే ఇప్పుడు ఆస్కార్‌కు ఎంపికైంది. ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం 24నిమిషాల నిడివి ఉంటుంది. 2019లో ‘Period. End of Sentence’ అనే ఇండియన్ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.