వర్మకి ‘వందనం’ : ఎక్కడ పట్టుకొచ్చావయ్యా స్వామీ!

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. నుంచి కొత్త పోస్టర్ విడుదల..

  • Publish Date - October 25, 2019 / 06:08 AM IST

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. నుంచి కొత్త పోస్టర్ విడుదల..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’.. ఇటీవల ‘చంపేస్తాడు బాబు చంపేస్తాడు’ అనే సాంగ్ రిలీజ్ చేసి రచ్చ లేపాడు.  దీపావళికి తెలుగు ప్రేక్షకులకు మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో వైఎస్, సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులను చూపించాడు.

అక్టోబర్ 27వ తేదీ ఉదయం 9:36 నిమిషాలకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించడమే కాక, పొలిటిషియన్స్, జర్నలిస్ట్స్, రౌడీస్, ఫ్యాక్షనిస్ట్స్, పోలీస్ పీపుల్ అండ్ కామన్ పీపుల్‌కి దివాళీ గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నట్టు.. గాడ్ బ్లెస్ #KRKR అని ట్వీట్ చేసి వర్మ.. ఇప్పుడు మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు.

Read Also : ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జూబ్లీ వేడుకకు గెస్ట్‌గా మెగాస్టార్

ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌ను పోలిన వ్యక్తి స్పీచ్ ఇస్తుండగా.. అతని చుట్టూ మోడల్స్ ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా అన్నట్టు రియాక్షన్ ఇచ్చాడు. దీపావళి శుభాకాంక్షలతో, బ్లెస్సింగ్స్‌తో అక్టోబర్ 27 ఉదయం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు మరోసారి చెప్పాడు వర్మ.