జయలలితగా కంగనా – వైరల్ అవుతున్న ‘తలైవి’ డ్యాన్స్ లుక్

‘తలైవి’ కంగనా రనౌత్ లేటెస్ట్ లుక్ రిలీజ్.. 2020 జూన్ 26న గ్రాండ్ రిలీజ్..

  • Publish Date - February 3, 2020 / 05:51 AM IST

‘తలైవి’ కంగనా రనౌత్ లేటెస్ట్ లుక్ రిలీజ్.. 2020 జూన్ 26న గ్రాండ్ రిలీజ్..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘తలైవి’.. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు. ఇటీవల కంగనా రనౌత్ లుక్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. లెజెండరీ తమిళనాడు దివంగత రాజకీయ నాయకుడు, మక్కల్ తిలగం ఎం.జి.రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో ప్రముఖ నటుడు అరవిందస్వామి నటిస్తున్నారు. ఆయన లుక్ అండ్ టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మ‌రో దివంగ‌త ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్ర‌లో విలక్షణ నటుడు ప్ర‌కాశ్‌రాజ్ న‌టిస్తున్నారు. జయలలిత ఉన్నత స్థాయి నటిగానే కాకుండా గొప్ప డాన్సర్‌గానూ కీర్తి పొందారు. ఆమె పాత్రలో పరకాయప్రవేశం చేసిన కంగనా రనౌత్ లేటెస్ట్ లుక్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ లుక్‌లో శాస్త్రీయ నృత్యం చేస్తున్న భంగిమలో కంగనా అమితంగా ఆకట్టుకుంటున్నారు.

Read Also : తిప్పూతుంటే నడుమే నాటీ.. నా కండ్లే చేసే కంత్రీ డ్యూటీ..

చుట్టూ పలువురు డాన్సర్లు నాట్యం చేస్తుండగా, మధ్యలో జయలలితగా కంగన నాట్యం చేస్తున్న తీరు అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రం కోసం కంగనా ప్రత్యేకంగా భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘తలైవి’ చిత్రాన్ని 2020 జూన్ 26న తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.