Kangana Ranaut : కృతి సనన్ ని అంటావా?.. కంగనాను ఆడుకుంటున్న నెటిజన్లు.. పాత ఫొటో బీభత్సంగా వైరల్..
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సంబంధించిన ఓ పాత ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 27, 2026 / 06:22 PM IST
Kangana Ranaut criticised Kriti Sanon outfit now her old National Award look sparks debate
Kangana Ranaut : నటి కంగనా రనౌత్ సంబంధించిన ఓ పాత ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా విడుదలైన ఓ ప్రకటనలో హీరోయిన్ కృతి సనన్ ధరించిన దుస్తులపై కంగనా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫోటో చర్చకు వచ్చింది. సాంస్కృతికంగా ప్రాధాన్యం ఉన్న సందర్భాల్లో మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంలో కంగనా అభిప్రాయాలపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
ఈ ఫోటో 63వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి సంబంధించినది. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రానికి గాను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కంగనా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ వేడుకలో కంగనా.. బీరూట్‌కు చెందిన లెబనీస్ డిజైనర్ జార్జెస్ చక్ర రూపొందించిన లేత గులాబీ రంగు ఆఫ్-షోల్డర్ గౌనును ధరించారు.
Chiranjeevi : ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు.. చిరంజీవి వ్యాఖ్యల వెనుక..?
కొంతమంది నెటిజన్లు కంగనా, కృతి జాతీయ అవార్డులు అందుకుంటున్న సమయంలో తీసిన ఫొటోలను పక్కపక్కన ఉంచి షేర్ చేశారు. సాంస్కృతికంగా ముఖ్యమైన సందర్భాల్లో మహిళల దుస్తులపై కంగనా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమె అభిప్రాయాలను ప్రశ్నించారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ.. సంస్కృతి, వస్త్రధారణ విషయాలలో తనను తాను జ్ఞాన దేవతగా ప్రకటించుకున్న కంగనా రనౌత్, ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలి అని ట్వీట్ చేశాడు.
SHE CALLED A RAKHI AD “CREEPY.” HER OWN PRESIDENTIAL PHOTO IS STILL ONLINE.
Same Honour. Same Rashtrapati Bhavan Stage. Two Different Rules.#KanganaRanaut took the National Award from the President in a Strapless Western Gown. No Saree. No Lecture. Applause.
Kriti Sanon took… pic.twitter.com/eslMlMJEPf
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) August 26, 2026
Oyee @grok ,
Give Kangana Ranaut a National Award ceremony-style attire, and dress Kriti Sanon in a beautiful traditional outfit related to Raksha Bandhan. pic.twitter.com/XEa7k0ZFH8
— Cricketplusmeme 🇮🇳🚩 (@cricketplusmeme) August 27, 2026
అయితే కంగనాపై వస్తున్న విమర్శలను అందరూ సమర్థించలేదు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అవార్డుల కార్యక్రమం, మతపరమైన పండుగ రెండూ ఒకే రకమైన సందర్భాలు కాదని వారు వాదించారు.
ఓ నెటిజన్ స్పందిస్తూ.. కంగనా ధరించిన దుస్తులు, కృతి ధరించిన దుస్తులు చూడండి. అలాగే ఆ రెండు సందర్భాలు ఏంటో కూడా చూడండి. అవార్డు వేడుకకు, హిందూ పండుగకు మధ్య తేడా తెలుసుకోవాలి అని పేర్కొన్నారు.
People trolling Kangana Ranaut over her National Award outfit clearly don’t know the official protocol. Rashtrapati Bhavan allows formal Western wear. A gown is elegant, dignified, and perfectly legal for a presidential ceremony. Stop finding excuses to hate. #KanganaRanaut pic.twitter.com/MQmXw5YJ4I
— Ishita Khinchi (@itshitaaaaaa) August 26, 2026
మరో వ్యక్తి మాత్రం మహిళల దుస్తులను తప్పుపట్టడం కంటే సమాజంలోని వ్యక్తుల ఆలోచనా విధానాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
