Chiranjeevi : ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు.. రవితేజకు అభినందనలు తెలుపుతూ చిరంజీవి హాట్ కామెంట్స్..
రవితేజ నటించిన ఇరుముడి చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల వర్షం కురిపించారు.
Megastar Chiranjeevi review on Ravi Teja Irumudi movie
Chiranjeevi : రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించగా.. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి చేరిపోయారు. ఈ సందర్భంగా చిరు చేసిన వ్యాఖ్యలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఒక చిత్రం విజయం సాధిస్తే పరిశ్రమలో అందరికి పండగే అని చెప్పారు. ఈ పరిశ్రమ అందరిది అని, ఏ కొందరిదో కాదన్నారు. మనం బతకాలి.. ఇతరులను బతికించాలి అని చెప్పుకొచ్చారు.
‘ఇరుముడి చిత్రం ఘన విజయం సాధించినందుకు నా ప్రియమైన సోదరుడు రవితేజకు హృదయపూర్వక అభినందనలు. ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంతో ఆస్వాదించాను. రవి అద్భుతంగా నటించాడు. త్రినాథ్ పాత్రను భుజాలపై మోశారు. ఇక దర్శకుడు శివ నిర్వాణ సున్నితమైన భావోద్వేగాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. బాలనటి నక్షత్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో భాగమైన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు, నిర్మాతలకు హృదయపూర్వక అభినందనలు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!.’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Vithika Sheru : హీరోయిన్ వితిక వరలక్ష్మీ వ్రతం ఫోటోలు వైరల్..
Heartiest congratulations to my dear brother Ravi on the blockbuster success of #Irumudi 💐
Thoroughly enjoyed the film from beginning to end. What a phenomenal performance @RaviTeja_offl, you carried Trinadh character entirely on your shoulders 👏🏻
Director @ShivaNirvana, you…
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 27, 2026
ఇక చిరు ట్వీట్ పై రవితేజ స్పందించారు. అన్నయ్య థ్యాంక్యూ అంటే హార్ట్ ఎమోజీలను జోడించి కృతజ్ఞతలు తెలియజేశారు.
Annayya ❤️❤️❤️
Thank you so much🙏🏻 https://t.co/5zeOhYaPJ9— Ravi Teja (@RaviTeja_offl) August 27, 2026
