Chiranjeevi : ఈ ప‌రిశ్ర‌మ అంద‌రిదీ.. ఏ కొంద‌రిదో కాదు.. చిరంజీవి వ్యాఖ్యల వెనుక..?

రవితేజ నటించిన ఇరుముడి చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల వర్షం కురిపించారు.

Megastar Chiranjeevi review on Ravi Teja Irumudi movie

Chiranjeevi : ర‌వితేజ హీరోగా న‌టించిన ఇరుముడి చిత్రం ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌గా.. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి చేరిపోయారు. ఈ సంద‌ర్భంగా చిరు చేసిన వ్యాఖ్య‌లు అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నాయి. ఒక చిత్రం విజ‌యం సాధిస్తే ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికి పండ‌గే అని చెప్పారు. ఈ ప‌రిశ్ర‌మ అంద‌రిది అని, ఏ కొంద‌రిదో కాద‌న్నారు. మ‌నం బ‌త‌కాలి.. ఇత‌రుల‌ను బ‌తికించాలి అని చెప్పుకొచ్చారు.

‘ఇరుముడి చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు నా ప్రియమైన సోదరుడు రవితేజ‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంతో ఆస్వాదించాను. ర‌వి అద్భుతంగా న‌టించాడు. త్రినాథ్ పాత్ర‌ను భుజాల‌పై మోశారు. ఇక ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ సున్నిత‌మైన భావోద్వేగాన్ని ఆవిష్క‌రించిన తీరు బాగుంది. బాల‌న‌టి న‌క్ష‌త్ర‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో భాగ‌మైన న‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్‌కు, నిర్మాత‌ల‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!.’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Vithika Sheru : హీరోయిన్‌ వితిక వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఫోటోలు వైర‌ల్‌..

ఇక చిరు ట్వీట్ పై ర‌వితేజ స్పందించారు. అన్న‌య్య థ్యాంక్యూ అంటే హార్ట్ ఎమోజీల‌ను జోడించి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.