Kangana Ranaut : ’12th ఫెయిల్’ దర్శకుడి భార్యపై.. కంగనా విమర్శలు.. నెటిజెన్స్ ప్రశంసలు..

'12th ఫెయిల్' దర్శకుడి భార్యపై కంగనా హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అసలు ఏమైంది..?

Kangana Ranaut viral comments on 12th fail director Vidhu Vinod Chopra wife Anupama Chopra

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. బి-టౌన్ లోని ఏ పెద్ద స్టార్‌ని లెక్క చేయకుండా విమర్శలు చేస్తూ వస్తుంటారు. తాజాగా ఈమె ’12th ఫెయిల్’ దర్శకుడి భార్యపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అసలు ఏమైంది..?

12th ఫెయిల్ అయిన ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ లైఫ్ స్టోరీ ఆధారంగా.. ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు విధు వినోద్ ఈ సినిమాని ప్రతి ఒక్కరి గుండెను హత్తుకునేలా తెరక్కించారు. థియేటర్స్ లో సూపర్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం.. ప్రస్తుతం ఓటీటీలో కూడా అదిరిపోయే వ్యూస్ సాధిస్తుంది. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు దర్శకుడిని చాలామంది బయపెట్టారట.

సినిమా హిట్ అవ్వడం కష్టమని, మూవీ కోసం పెడుతున్న ఖర్చులో పావు వంతు కూడా రావడం కష్టమని, ఓటీటీకి ఇచ్చి సమస్య నుంచి బయట పాడమని సలహాలు ఇచ్చారట. ఇలా సలహాలు ఇచ్చిన వారిలో దర్శకుడు భార్య అనుపమ చోప్రా కూడా ఉన్నారు. ఈమె బాలీవుడ్ లో ప్రముఖ సినీ క్రిటిక్ గా కొనసాగుతున్నారు. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుపమ చోప్రా తన భర్త విధు వినోద్‌తో ఇలా అన్నారట.. ‘ఈ సినిమా చూడడానికి థియేటర్స్ కి ఎవరు రారు. నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు’ అని చెప్పారట.

Also read : Naresh : జంధ్యాల గారికి రచయిత అవకాశంతో పాటు హీరో ఛాన్స్ కూడా వచ్చింది.. కానీ..

దర్శకుడు ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసారు. ఇక దర్శకుడు కామెంట్స్ పై కంగనా రియాక్ట్ అవుతూ.. “ఆమెకు (అనుపమ చోప్రా) తెలివైన అమ్మాయిలు అంటే జెలసీ, తనకైనా తెలివిగల వారంటే గిట్టదు. అలాంటి మనిషి. తన భర్తని కూడా చూసి అసూయపడడం పెద్ద ఆశ్చర్యం కాదులే. ఆమె తన భర్త సంపాదించిన పేరు, డబ్బు ఉపయోగించుకొని వెబ్ సైట్స్, వ్యాపారాలు, ఇండస్ట్రీలో పరిచయాలు సంపాదించుకుంది. అక్కడ గాసిప్ గ్యాంగ్ తో కలిసి ఇతరాలను తొక్కేలని చూస్తూ ఉంటుందని” ట్వీట్ చేశారు.

ఇక కంగనా ట్వీట్ చూసిన నెటిజెన్స్.. ‘మీ అంత ధైర్యంగా ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడరండీ’ అంటూ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం కంగనా ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు