Naresh : జంధ్యాలకు రచయిత అవకాశంతో పాటు హీరో ఛాన్స్ కూడా వచ్చింది.. కానీ..

జంధ్యాలకి ఒకే సమయంలో రచయిత అవకాశంతో పాటు హీరో ఛాన్స్ కూడా వచ్చిందట. ఈ విషయాన్ని నరేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Naresh : జంధ్యాలకు రచయిత అవకాశంతో పాటు హీరో ఛాన్స్ కూడా వచ్చింది.. కానీ..

Tollywood Senior actor naresh interesting comments about director Jandhyala

Naresh : టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కొంతమంది దర్శకులు అయితే.. నరేష్ కోసం ప్రత్యేకంగా పాత్రలు కూడా సృష్టించి ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇక కొన్ని రోజుల నుంచి నరేష్ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జంధ్యాల గురించిన ఆసక్తికర విషయాన్ని తెలియజేసారు.

కెరీర్ స్టార్టింగ్ లో ఎలాగైనా ఇండస్ట్రీలో ఉండాలనే ఉద్దేశంతో జంధ్యాల.. నటుడిగా కూడా ప్రయత్నాలు చేశారట. ఈక్రమంలోనే ఒక పక్క రచయితగా అవకాశాలు కోసం ఎదురు చూస్తూనే.. యాక్టర్ గా కూడా ఆడిషన్స్ ఇచ్చేవారట. ఆలా ఒక్క అవకాశం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో.. జంధ్యాలకు అదృష్టం రెండుగా వచ్చి ఎదురుగా నిలిచింది. ఒకే రోజు హీరోగా, రచయితగా అవకాశం వచ్చిందట. ఈ విషయం గురించి నరేష్ తో జంధ్యాల చాలా సందర్భాల్లో మాట్లాడేవారట.

Also read : సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాపై.. నాయి బ్రాహ్మణ సంఘం ఆసక్తికర వ్యాఖ్యలు.. 

”ఒకే రోజు హీరోగా అవకాశం వచ్చిందని ఒక లెటర్, అలాగే నిర్మాత నాగిరెడ్డి దగ్గర రచయితగా అవకాశం వచ్చిందని మరో లెటర్ డోర్ బెల్ కొట్టాయి. ఇక ఆ రెండు లెటర్స్ చూసిన జంధ్యాల.. ఏది నిర్ణయించుకోవాలో అర్థంకాలేదు. ఆరోజు రాత్రంతా పడుకోలేదట. అలా రాత్రంతా ఆలోచించిన జంధ్యాల.. మార్నింగ్ అవ్వగానే హీరో ఛాన్స్ లెటర్ ని చించేశారట. రచయితగా తన కెరీర్ ని ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఎంతోమంది ఆడియన్స్ ముఖం పై చిరునవ్వు అయ్యింది, పలువురు నటీనటుల కెరీర్ కి విజయం అయ్యింద”ని నరేష్ అన్నారు.

అయితే జంధ్యాల ఆ తరువాత నటుడిగా కూడా కనిపించారు. రాజేంద్రప్రసాద్ ‘రెండు రెళ్ళు ఆరు’, చిరంజీవి ‘ఆపద్బాంధవుడు’ సినిమాల్లో ముఖ్య పాత్రలు చేసి.. తన నటనతో కూడా ఆడియన్స్ ని మెప్పించారు.