#Thalaivi షెడ్యూల్ పూర్తి చేశాను.. ఫొటోలు షేర్ చేసిన కంగనా

  • Publish Date - October 11, 2020 / 07:34 PM IST

Thalaivi Kangana Ranaut : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ #Thalaivi తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జయలలిత పాత్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తోంది. AL విజయ్ దర్శకత్వం వహిస్తున్న తలైవి బయోపిక్ కి సంబంధించి లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది.



ఈ విషయాన్ని కంగనా వెల్లడిస్తూ ట్విట్టర్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసిందామె. ‘కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని మార్చేసి ఉండొచ్చు.. కానీ, అది కెమెరా ముందు ఉన్న తన అనుభవాన్ని మార్చలేకపోయిందని కంగనా ట్వీట్ చేసింది.



ఫొటోల్లో కంగనా ముఖానికి మాస్క్ ధరించి ఉంది. ‘జయ మా ఆశీర్వాదంతో మేము తలైవి విప్లవాత్మక నాయకురాలి మరో షెడ్యూల్ పూర్తి చేశాం.. కరోనా తరువాత చాలా విషయాలు భిన్నంగా ఉండొచ్చు. కానీ, నటన ముందు అవేమి మారవు. చిత్రబృందానికి ధన్యవాదాలు అంటూ @vishinduri@ShaaileshRSingh #ALVijay కంగనా ట్వీట్ చేసింది.



కొన్నిరోజుల క్రితమే ఫొటోలను మూవీ డైరెక్టర్ తో కంగనా షేర్ చేసుకుంది. ఇందులో కొన్ని ఫొటోలు డైరెక్టర్ విజయ్‌తో చర్చిస్తున్న సమయంలో తీసినవి అంటూ ట్వీట్ లో పేర్కొంది. ప్రపంచంలో అనేక అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ, వాటిన్నంటి కంటే ఫిల్మ్ సెట్ తనకెంతో సౌకర్యవంతంగా అనిపించిందని కంగనా ట్వీట్ చేసింది.



రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ కథ రాయగా.. విష్ణు వర్ధన్ ఇందూరి, షైలేశ్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తలైవి అనేక భాషల్లో తెరకెక్కుతోంది. కంగనాతో పాటు అరవింద్ స్వామి, ప్రకాశ్ రాజ్, జిస్సు సేన్ గుప్తా, భాగ్యశ్రీ తదితరులు నటిస్తున్నారు.