Kangana Ranauts Personal Bodyguard Booked For Rape
Kangana Ranauts ‘Personal Bodyguard : ముంబైలో డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాచార కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 376, 377 కింద కుమార్ హెగ్డే అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడు ఎవరో చెప్పడానికి పోలీసులు నిరాకరించినట్లు సమాచారం. అయితే..హెగ్డే..ప్రముఖ నటి కంగనా రనౌత్ కు వ్యక్తిగత బాడీగార్డ్ అని ప్రచారం జరుగుతోంది. ఐపీసీ సెక్షన్ 376 అత్యాచారానికి సంబంధించింది కాగా.. ఐపీసీ 377 అసహజ శృంగారానికి సంబంధించింది.
అతను ఏమి పని చేస్తాడో తెలియదని సీనియర్ ఇన్స్ పెక్టర్ గైక్వాడ్ వెల్లడించారు. peepingmoon.com కథనం ప్రకారం…ఎనిమిది సంవత్సరాల క్రితం నిందితుడిని కలిసినట్లు బాధితురాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత జూన్ లో వివాహం చేసుకొనేందుకు అంగీకరించినట్లు, అప్పటికే శారీరక సంబంధం ఏర్పడిందని పేర్కొన్నట్లు సమాచారం.
ఏప్రిల్ 27వ తేదీన హెగ్డే తన ప్లాట్ నుంచి రూ. 50 వేలతో ఉడాయించాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై కంగనా రనౌత్ కార్యాలయం స్పందించాల్సి ఉంది.
Read More : విశాఖ ఉక్కు ఉద్యమానికి 100 రోజులు