Suriya – Jyothika : జిమ్‌లో సూర్యతో కలిసి జ్యోతిక వర్క్ అవుట్స్.. పర్ఫెక్ట్ కపుల్ గోల్స్..

జిమ్‌లో సూర్యతో కలిసి జ్యోతిక వర్క్ అవుట్స్ వీడియో వైరల్. సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న వర్క్ అవుట్స్ చూసి నెటిజెన్స్ 'వావ్' అంటున్నారు.

Kanguva star Suriya gym workouts with his wife Jyothika

Suriya – Jyothika : కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతికలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తమ బాండింగ్ తో సూర్య, జ్యోతిక అందర్నీ ఆకట్టుకుంటుంటారు. ఒకే ప్రొఫిషన్ కి చెందిన ఇద్దరి మధ్య ఇంతటి బాండింగ్ ఉండడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అలాంటిది వీరిద్దరూ ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

ప్రతి విషయంలో భర్తకి తోడుగా భార్య ఉంటే ఆ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుటుంది. ఆ పాయింట్ నే జ్యోతిక చాలా గట్టిగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సూర్య ‘కంగువ’ వంటి భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్య ఒక వైల్డ్ బీస్ట్ గా కనిపించబోతున్నారు. దీంతో భారీ కండలు పెంచాల్సి వచ్చింది. అందుకోసమే జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్నారు.

Also read : Vijay Deverakonda : దళపతి విజయ్ పాలిటిక్స్ పై విజయ్ దేవరకొండ కామెంట్స్.. ఏమన్నాడంటే..!

ఇక కసరత్తులో సూర్యకి తోడుగా జ్యోతిక కూడా పాల్గొంటూ జోష్ నింపుతున్నారు. సూర్యతో పాటుగా జ్యోతిక కూడా ప్రతి వర్క్ అవుట్ చేస్తూ.. సూర్యలో ఫైటింగ్ స్పిరిట్ ని తీసుకు వస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న వర్క్ అవుట్స్ చూసి ‘వావ్’ అంటున్నారు. మరికొందరు ‘పర్ఫెక్ట్ కపుల్ గోల్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ లవ్లీ వీడియోని మీరు కూడా చూసేయండి.

కంగువ సినిమా విషయానికి వస్తే.. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శివ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకొని మూవీ పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ మూవీ కథ మొత్తం మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందట. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో ఈ సినిమాని ఆడియన్స్ కి చూపించబోతున్నారు. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు