Vijay Deverakonda : దళపతి విజయ్ పాలిటిక్స్ పై విజయ్ దేవరకొండ కామెంట్స్.. ఏమన్నాడంటే..!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పాలిటిక్స్ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఒక లీడర్ లో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం..

Vijay Deverakonda : దళపతి విజయ్ పాలిటిక్స్ పై విజయ్ దేవరకొండ కామెంట్స్.. ఏమన్నాడంటే..!

Vijay Deverakonda comments on thalapathy vijay politics

Updated On : April 2, 2024 / 7:35 PM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ తెలుగుతో తమిళంలో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో విజయ్ తెలుగుతో పాటు తమిళ ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దళపతి విజయ్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు. తమిళ స్టార్ హీరో విజయ్.. ఇటీవల పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

దీని గురించి మీ కామెంట్స్ ఏంటని విజయ్ ని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “నేను విజయ్ సార్ మూవీ ఫంక్షన్స్ చూసేవాడిని. వాటిలో విజయ్ సార్ చాలా బాగా మాట్లాడుతూ కనిపించేవారు. ఒక లీడర్ లో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం పబ్లిక్ లో అందరికి అర్ధమయ్యేలా మాట్లాడడం, ఆ చెప్పే విషయాన్ని వినేవారికి చాలా దృడంగా చెప్పడం. ప్రపంచంలోని ఎంతోమంది గొప్ప లీడర్స్ లో ఈ లక్షణం కనిపిస్తుంది. అలాంటి వ్యాఖ్యాచాతుర్యం విజయ్ సార్ లో ఉంది. దానితో భవిషత్తులో ఆయన ఎలాంటి మార్పులు తీసుకు వస్తారో అనేది చూడాలని ఉంది” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read : Visweswara Rao : సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. కమెడియన్ విశ్వేశ్వర రావు మరణం..

ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు, తమిళంలోనే రిలీజ్ అవుతున్న ఈ చిత్రం రెండు వారాలు తరువాత హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ కానుంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పరుశురాం డైరెక్ట్ చేసారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. గీతగోవిందం తరువాత విజయ్ అండ్ పరుశురాం నుంచి వస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో.. ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.