Tarak Ponappa : జనతా గ్యారేజ్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘దేవర’ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రెండు పార్టులుగా రాబోతున్న ఈ మూవీలో ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాలో దయ క్యారెక్టర్లో అలరించిన తారక్ పొన్నప్ప ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తారక్ పొన్నప్ప తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
Guntur Kaaram : గుంటూరు కారం అప్డేట్ వచ్చేసింది.. మహేష్ కి ముద్దు పెట్టిన శ్రీలీల..
దేవర షూటింగ్ సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సెట్‌కి వచ్చారట. ఆ టైమ్‌లో ప్రశాంత్ నీల్ తన గురించి ఎన్టీఆర్‌కి చెప్పి ఉంటారని అనుకున్నట్లు తారక్ పొన్నప్ప అన్నారు. ఎన్టీఆర్‌ని తాను కలిసినపుడు మనస్ఫూర్తిగా విష్ చేశారని అన్నారు. ఎన్టీఆర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని.. పెద్ద స్టార్ అనే యాటిట్యూడ్ ఉండదని.. ఆయనతో షూటింగ్ చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందని తారక్ పొన్నప్ప చెప్పారు. ఎన్టీఆర్‌ని చూస్తే దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తొచ్చారని ఇద్దరి క్యారెక్టర్లలో సిమిలారిటీస్ కనిపిస్తాయని చెప్పుకొచ్చారు ఈ నటుడు. తారక్ పొన్నప్ప జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
కాగా దేవర సినిమా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్‌కి జోడిగా జాన్వీకపూర్ నటిస్తున్నారు. విలన్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2014 , ఏప్రియల్ 5 న విడుదల కాబోతోంది.