Sandeep Reddy Vanga : చిరంజీవితో సినిమా చేయడానికి నేను రెడీ.. యానిమల్ డైరెక్టర్ కామెంట్స్.. చిరు ఛాన్స్ ఇస్తాడా?

తాజాగా డైరెక్టర్ సందీప్ వంగ అమెరికాకు వెళ్లి అక్కడ యానిమల్(Animal) సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. యానిమల్ సినిమా అమెరికాలో కూడా ఇప్పటికే 10 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది.

Sandeep Reddy Vanga : చిరంజీవితో సినిమా చేయడానికి నేను రెడీ.. యానిమల్ డైరెక్టర్ కామెంట్స్.. చిరు ఛాన్స్ ఇస్తాడా?

Sandeep Reddy Vanga wants to do Movie with Megastar Chiranjeevi if he got a Chance

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేసి వెంటనే బాలీవుడ్ వెళ్ళిపోయి ఇదే సినిమాని అక్కడ కబీర్ సింగ్ గా తీసి హిట్ కొట్టాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నా సినిమాలు నా ఇష్టం అంటూ ఆర్జీవీ లాగే కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ ఆడిస్తున్నాడు. అసలు రణబీర్ ఇలాంటి సినిమా తీస్తాడని కలలో కూడా ఎవరూ ఊహించలేదు.

ఒకే సినిమాలో ఎమోషన్స్, బోల్డ్ సీన్స్, యాక్షన్ సీన్స్ తో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి అందర్నీ మెప్పిస్తున్నాడు సందీప్ వంగ. యానిమల్ సినిమా భారీ హిట్ కొట్టి ఇప్పటికే 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రణబీర్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. దీంతో సందీప్ వంగ పేరు బాలీవుడ్ లో మారుమ్రోగిపోతుంది. ఇక ఈ సినిమా సక్సెస్ పై చిత్రయూనిట్ ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా డైరెక్టర్ సందీప్ వంగ అమెరికాకు వెళ్లి అక్కడ యానిమల్(Animal) సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. యానిమల్ సినిమా అమెరికాలో కూడా ఇప్పటికే 10 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది. తాజాగా నేడు డల్లాస్ లోని తెలుగు వారితో యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకొని ఆ తర్వాత కాసేపు వారితో ముచ్చటించారు సందీప్ వంగ. ఈ నేపథ్యంలో చిరంజీవి(Chiranjeevi) ఛాన్స్ ఇస్తే ఆయనతో సినిమా చేయడానికి నేను రెడీ. ఆయనతో యాక్షన్ జోనర్ లో సినిమా తీస్తాను అని అన్నాడు.

Also Read : Prabhas : కల్కి షూటింగ్ సెట్‌లో నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్.. ప్రభాస్ లుక్ చూశారా? గడ్డం, మీసాలతో..

దీంతో సందీప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గతంలో కూడా సందీప్.. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్. ఆయనతో సినిమా తీసే ఛాన్స్ వస్తే వదులుకోను అని అన్నాడు. సందీప్ మూడు సినిమాలతోనే ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా చేరాడు. ప్రస్తుతం సందీప్ చేతిలో ప్రభాస్ స్పిరిట్, అల్లు అర్జున్ సినిమాలు ఉన్నాయి. ఇక చిరంజీవి ప్రస్తుతం వశిష్టతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. మరి చిరంజీవి సందీప్ కి ఛాన్స్ ఇస్తాడా చూడాలి. ఈ కాంబోలో సినిమా పడితే మాత్రం హై రేంజ్ యాక్షన్ ఫీస్ట్ ఉంటుంది అని అభిమానులు, సినిమా లవర్స్ అనుకుంటున్నారు.