Prabhas : కల్కి షూటింగ్ సెట్‌లో నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్.. ప్రభాస్ లుక్ చూశారా? గడ్డం, మీసాలతో..

తాజాగా ప్రభాస్ ని కల్కి షూటింగ్ సెట్ లో కలిశారు టెడ్ సరండోస్. కల్కి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ఇండోర్ సెట్ లో జరుగుతుంది.

Prabhas : కల్కి షూటింగ్ సెట్‌లో నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్.. ప్రభాస్ లుక్ చూశారా? గడ్డం, మీసాలతో..

Netflix CEO Ted Sarandos meets Prabhas and Kalki 2898 AD Movie Unit at Shooting Set

Prabhas : నెట్ ఫ్లిక్స్(Netflix) CEO టెడ్ సరండోస్(Ted Sarandos) ఇండియాకు రాగా టాలీవుడ్ లో వరుస పెట్టి స్టార్స్ అందర్నీ కలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. మొన్న మెగాస్టార్ ఫ్యామిలీని కలిసి, చిరంజీవి ఇంట్లో లంచ్ చేసి చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, నిర్మాతలు శోభు యార్లగడ్డ, విక్కీలతో కలిసి మాట్లాడారు టెడ్ సరండోస్. నిన్న నందమూరి ఫ్యామిలీని కలిసి ఎన్టీఆర్ ఇంట్లో లంచ్ చేసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కొరటాల శివతో ముచ్చటించారు. నిన్న రాత్రి అల్లు అర్జున్, సుకుమార్ తో స్పెషల్ డిన్నర్ చేశారు. మైత్రి నిర్మాతలు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం రామానాయుడు స్టూడియోలో టెడ్ సరండోస్ కి స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయగా వెంకటేష్, నాగ చైతన్య, రాజమౌళి, సురేష్ బాబు, రానా, దుల్కర్ సల్మాన్, నిర్మాత శోభు యార్లగడ్డ.. పలువురు మరికొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

నేడు ఉదయం గుంటూరు కారం సెట్లో మహేష్ బాబు, త్రివిక్రమ్ ని కలిశారు. మహేష్ వారితో కలిసి దిగిన ఫోటోనో సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ప్రభాస్ ని కల్కి షూటింగ్ సెట్ లో కలిశారు టెడ్ సరండోస్. కల్కి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ఇండోర్ సెట్ లో జరుగుతుంది. ఈ సెట్ కి టెడ్ సరండోస్ వెళ్లగా ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ లని కలిశారు. అనంతరం కల్కి చిత్రయూనిట్ తో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఫొటోల్లో ప్రభాస్ ఫుల్ గడ్డంతో, మీసాలతో ఉండటంతో ప్రభాస్ లుక్ వైరల్ గా మారింది. ప్రభాస్ ఇంత గడ్డం, మీసాలతో గతంలో ఎప్పుడు కనపడలేదు. కల్కి సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన లుక్స్, టీజర్ లో ప్రభాస్ కి అసలు గడ్డం లేదు కానీ ఇప్పుడు ఇంత గడ్డం, మీసాలతో కనపడటంతో సినిమాలో ఇంకో పాత్ర కూడా ఉండబోతుందా అని ఆలోచిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫోటో బయటకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.

Netflix CEO Ted Sarandos meets Prabhas and Kalki 2898 AD Movie Unit at Shooting Set

Also Read : Ted Sarandos : వరుసపెట్టి టాలీవుడ్ స్టార్స్ ని కలుస్తున్న నెట్‌ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్.. పుష్పతో స్పెషల్ మీట్..

ఇక నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ ఇండియాకు రావడం, టాలీవుడ్ కి వచ్చి వరుసగా స్టార్ సెలబ్రిటీలందర్నీ కలవడం ఇప్పుడు చర్చగా మారింది. నెట్ ఫ్లిక్స్ లో భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయనున్నారో, వాటిల్లో మన స్టార్స్ ఎలా భాగం అవ్వనున్నారో అని ప్రేక్షకులు, అభిమానులు చర్చించుకుంటున్నారు. టెడ్ సరండోస్ ఇంకెంతమంది టాలీవుడ్ స్టార్స్ ని కలుస్తారో చూడాలి.

Netflix CEO Ted Sarandos meets Prabhas and Kalki 2898 AD Movie Unit at Shooting Set