Kannada Power Star : పునీత్ రాజ్ కుమర్ హాఠాన్మరణం, గుండెపోటుతో అభిమాని మృతి
పొన్నాచ్చి తాలూకాలోని మరూరుకి చెందిన మునియప్పన్ కూడా పునీత్ వీరాభిమాని. పునీత్ చనిపోయాడానే విషయాన్ని తెలుసుకున్న ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
- madhu
- Published On : October 30, 2021 / 01:36 PM IST
Puneeth
Puneeth Rajkumar’s Fan Dies : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం పట్ల అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయాయారు. కన్నడ సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురైంది. చిన్న వయస్సులోనే…అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ నటుడు మృతి చెందడం ప్రతొక్కరినీ కదలించి వేసింది. ఆయనకు కన్నీళ్లతో నివాళలుర్పిస్తున్నారు. సినీ రంగానికి చెందిన వారే కాకుండా..ఇతరులకు ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నారు. పునీత్ అభిమానులు అయితే..తట్టుకోలేకపోతున్నారు.
Read More : Puneeth Rajkumar: పునీత్‌కి మరణం లేదు.. నన్ను మామ అని పిలిచేవాడు
ఆయన ఎంతోమందికి సేవ చేసిన విషయాలను గుర్తు చేసుకుంటూ…కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉంటే…పొన్నాచ్చి తాలూకాలోని మరూరుకి చెందిన మునియప్పన్ కూడా పునీత్ వీరాభిమాని. పునీత్ చనిపోయాడానే విషయాన్ని తెలుసుకున్న ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పునీత్ అంటే అతనికి ప్రాణం. ఆయన చనిపోయారనే వార్త…తెలియగానే..తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంసభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. మునియప్పన్ కు ఇటీవలే వివాహమైందని..ఏడాదిన్నర వయస్సున్న పాప ఉందని తెలుస్తోంది. మునియప్పన్ మృతి..స్థానికంగా విషాదాన్ని నింపింది.
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ హాఠన్మరంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కర్నాటకలో హై అలర్ట్ ప్రకటించింది. అభిమానులు శాంతిగా ఉండాలని పిలుపునిచ్చింది. థియేటర్స్ తో పాటు..మద్యపాన విక్రాయాలు ఆదివారం వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పునీత్ రాజ్ కుమార్ కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత…అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. పలు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పునీత్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.
