India First Dubbing Movie : ఇండియా ఫస్ట్ డబ్బింగ్ మూవీ.. ఏ భాషలోకి మొదట డబ్ అయ్యిందో తెలుసా?

సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో 'ఏ వి ఎం ప్రొడక్షన్స్' అంటే ఒక బ్రాండ్. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా పలు సినిమాలు తెరకెక్కించారు. దాదాపు 300 పైగా సినిమాలు తెరకెక్కించిన ఈ నిర్మాణ సంస్థ.. డబ్బింగ్ సినిమాలకు తొలి అడుగు వేసింది. 1943 ముందు వరకు..

India First Dubbing Movie : ఇండియా ఫస్ట్ డబ్బింగ్ మూవీ.. ఏ భాషలోకి మొదట డబ్ అయ్యిందో తెలుసా?

kannada Satya Harishchandra is the india first dubbing movie

Updated On : March 2, 2023 / 1:09 PM IST

India First Dubbing Movie : సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ‘ఏ వి ఎం ప్రొడక్షన్స్’ అంటే ఒక బ్రాండ్. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా పలు సినిమాలు తెరకెక్కించారు. దాదాపు 300 పైగా సినిమాలు తెరకెక్కించిన ఈ నిర్మాణ సంస్థ.. డబ్బింగ్ సినిమాలకు తొలి అడుగు వేసింది. 1943 ముందు వరకు ఏ భాషలో తెరకెక్కిన సినిమాని ఆ బాషలోనే చూసేవారు. ఒక మంచి సినిమాని ఇతర భాషల వారికీ కూడా చూపించాలని ఎవరన్నా అనుకుంటే ఆ సినిమాని మళ్ళీ పూర్తి ఖర్చుతో రీమేక్ చేసి వేరే భాషలో రిలీజ్ చేసేవారు. కానీ 1943 లో విడుదలైన ‘సత్య హరిశ్చంద్ర’ సినిమాతో ఈ పద్దతికి ముగింపు పడింది.

Rajinikanth : జై భీమ్ దర్శకుడితో రజినీకాంత్ కొత్త సినిమా అనౌన్స్..

ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏ వి ఎం అధినేత మెయ్యప్పన్ మనుమరాలు అరుణ గుహన్ తెలియజేస్తూ తాజాగా ట్వీట్ చేశారు. మెయ్యప్పన్ నిర్మాణంలో దర్శకుడు ఆర్ నాగేంద్రరావు.. కన్నడలో ‘సత్య హరిశ్చంద్ర’ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని మైసూర్ మరియు కన్నడ మాట్లాడే ప్రాంతాలలో పెద్ద విజయాన్ని సాధించింది. 100 రోజులు పాటు థియేటర్ లో రన్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకి ఆడియో ఇంజనీర్ గా శ్రీనివాస్ రాఘవన్ పని చేశారు. థియేటర్ లో ఈ సినిమా విజయోత్సవం చూసిన రాఘవన్ బుర్రలో ఒక ఆలోచన పుట్టింది.

ఇంత అద్భుతమైన సినిమాని ఇతర భాషల వారికీ కూడా ఎందుకు చూపించకూడదు? ఎవరైనా లిప్ మూమెంట్‌తో సింక్‌గా వేరే భాషలో మాట్లాడితే ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయవచ్చు కదా? అనే ఆలోచన మొదలు అవ్వడంతో.. సినిమాలోని ఒక రీల్‌లోని డైలాగ్ ట్రాక్‌ను చెరిపివేసి, తమిళంలో డైలాగ్స్ రాసి ఒక రీల్ తయారు చేశాడు. ఆ రీల్ ని శ్రీనివాస్ రాఘవన్, నిర్మాత మెయ్యప్పన్ దగ్గరకి తీసుకు వెళ్లి చూపించాడు. అది చూసిన మెయ్యప్పన్.. పూర్తి ఖర్చుతో కొత్త సినిమాని తెరకెక్కించడం కంటే కొంచెం ఖర్చుతో ఇలా డబ్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అని సత్య హరిశ్చంద్ర సినిమాని డబ్బింగ్ చేయడానికి సిద్ధమయ్యారు.

Manchu Manoj Marriage : మంచు మనోజ్ పెళ్లి రేపేనా? సైలెంట్‌గా మౌనికతో వివాహం!

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆర్ నాగేంద్రరావుని మరియు ఒక తమిళ డైలాగ్ రైటర్ ని పిలిపించి.. సినిమా మొత్తానికి డైలాగ్స్ రాయించాడు. సినిమాలో నటించిన యాక్టర్స్ తోనే తమిళంలో కూడా డబ్బింగ్ చెప్పించాడు. దాదాపు 11,000 అడుగులు ఉన్న సినిమా రీల్ మొత్తానికి పగలు మరియు రాత్రి కష్టపడి ఒక్క రీటేక్ లేకుండా డబ్బింగ్ పూర్తి చేశారు. ఇక ఎట్టకేలకు తమిళంలో రిలీజ్ అయిన ఈ డబ్బింగ్ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఆ తరువాత డబ్బింగ్ సినిమాల సంప్రదాయం మొదలైంది.