S K Bhagavan : చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి..

సినీ పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజులు క్రిందట టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణించగా, ఈ రోజు (ఫిబ్రవరి 20) కన్నడ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. శాండిల్ వుడ్ కి సంబంధించిన..

S K Bhagavan

S K Bhagavan : సినీ పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నార్త్ నుంచి సౌత్ వరకు ప్రతి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు స్వర్గస్థులు అవుతూ వస్తున్నారు. రెండు రోజులు క్రిందట టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణించగా, ఈ రోజు (ఫిబ్రవరి 20) కన్నడ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. శాండిల్ వుడ్ కి సంబంధించిన అగ్ర దర్శకుడు ఎస్ కె భగవాన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భగవాన్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు. 90 ఏళ్ళ వయసులో సోమవారం తెల్లవారుజామున ఈ లోకాన్ని విడిచి పెట్టి అనంతలోకాలకు వెళ్లిపోయారు.

TarakaRatna : బాలయ్య నిర్ణయించిన సమయానికే తారకరత్న అంత్యక్రియలు..

కన్నడ చిత్రసీమకు ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన ఎస్ కె భగవాన్.. తన స్నేహితుడు దొరై రాజ్‌తో కలిసి 27 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్ కి శాండిల్ వుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ 27 చిత్రాల్లో ఎక్కువ సినిమాలు కన్నడ దిగ్గజ నటుడు స్వర్గీయ రాజ్‌కుమార్‌తో చేశారు. తన స్నేహితుడు దొరై రాజ్‌ మరణం తరువాత చాలా ఏళ్ళు దర్శకత్వం చేయలేదు. చివరిగా ఆయన 2019 లో తన 50వ చిత్రం ఔద్వా గోంబేకి దర్శకత్వం వహించారు.

ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు శ్రీ ఎస్. కె. భగవాన్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మ కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. దొరై-భగవాన్ జంట కన్నడ సినిమాకు ఎన్నో టేస్ట్ ఫుల్ సినిమాలను అందించింది” అంటూ ట్వీట్ చేశారు.