Yash 19 : యశ్ 19 టైటిల్ అనౌన్స్.. ‘టాక్సిక్’ అంటూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్..

అభిమానులంతా యశ్ 19 అప్డేట్ కోసం ఇన్నాళ్లు ఎదురు చూశారు. తాజాగా ఆ అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.

Kannada star hero Yash 19 movie titled as toxic

Yash 19 : కన్నడ హీరో ‘యశ్’ కేజీఎఫ్ సినిమాలతో ఇండియా వైడ్ భారీ క్రేజ్ ని సంపాదించుకున్నారు. కేజీఎఫ్ 2‌ దాదాపు 1250 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని ఇండియన్ టాప్ మూవీగా నిలిచింది. ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. తన తదుపరి సినిమాని ప్రభాస్ తో అనౌన్స్ చేసి దానిని రిలీజ్ కి కూడా సిద్ధం చేశారు. కానీ సినిమాలో హీరోగా నటించిన యాష్ మాత్రం ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయలేదు. అభిమానులంతా యశ్ 19 అప్డేట్ కోసం ఇన్నాళ్లు ఎదురు చూశారు.

తాజాగా ఆ అప్డేట్ ని ఇటీవల ఇచ్చారు. టైటిల్‌ని, దర్శకుడిని డిసెంబర్ 8న అనౌన్స్ చేస్తామంటూ ప్రకటించారు. నేడు ఆ విషయాలను రివీల్ చేసేశారు. ముందు నుంచి వినిపిస్తునట్లు యాష్ 19ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి ‘టాక్సిక్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్, దర్శకురాలిని రివీల్ చేయడమే కాదు.. రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు.

Also read : Extra Ordinary Man Twitter Review : ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

ఇక టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే.. జోకర్, మ్యాజిక్, గ్యాంబ్లింగ్ తరహాలో ఈ సినిమా ఉండబోతుందా అనే సందేహం కలుగుతుంది. KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక గీతూ మోహన్ దాస్ విషయానికి వస్తే.. నటిగా మలయాళంలో పలు సినిమాల్లో నటించి అనంతరం దర్శకురాలిగా మారి మూడు సినిమాలు చేశారు. నివీన్ పాలీతో ‘మూత్తోన్’ అనే అవార్డ్ ఫిల్మ్ తీసి మంచి విజయం సాధించారు. మరి కేజీఎఫ్ వంటి సక్సెస్ లో ఉన్న యశ్ ని గీతూ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు