Shiva Rajkumar : సిద్దార్ధ్ క్షమించండి.. కన్నడ సినీ పరిశ్రమ తరపున సారీ చెప్పిన శివన్న
తమిళ సినిమా 'చిక్కు' కన్నడ వెర్షన్ 'చిత్త' కోసం బెంగళూరులో నటుడు సిద్దార్ధ్ పెట్టిన ప్రెస్ మీట్‌ను నిరసన కారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తాజాగా శివన్న సిద్దార్ధ్‌కు క్షమాపణలు చెప్పారు.
- Lakshmi 10tv
- Published on- September 29, 2023 / 03:21 PM IST
Shiva Rajkumar
Shiva Rajkumar : కావేరీ జల వివాదంపై మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తూ నిరసకారులు హీరో సిద్దార్ధ్ ప్రెస్ మీట్‌ను అడ్డుకోవడం తెలిసిందే. దాంతో సిద్దార్ధ్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుని వేదిక నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ స్పందించారు. కన్నడ చిత్ర పరిశ్రమ తరపున శివన్న సిద్దార్ధ్‌కు క్షమాపణలు చెప్పారు.
Prakash Raj supports Siddharth : కావేరీ వివాదం.. హీరో సిద్దార్ధ్‌కి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్
సిద్దార్ధ్ లేటెస్ట్ మూవీ ‘చిత్త’ కన్నడ వెర్షన్ ‘చిక్కు’ ను ప్రమోట్ చేసుకోవడానికి బెంగళూరు వెళ్లారు. ప్రెస్ మీట్ ప్రారంభమవుతుండగా నిరసనకారులు వేదిక వద్దకు వచ్చి గొడవ చేసారు. కార్యకర్తలు సృష్టించిన గందరగోళానికి సిద్దార్ధ్ కార్యక్రమాన్ని నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై శివ రాజ్‌కుమార్ విచారం వ్యక్తం చేసారు.
Karnataka bandh today: కావేరి జల వివాదంపై నేడు కర్ణాటక బంద్…144 సెక్షన్ విధింపు
శివ రాజ్‌కుమార్ సిద్దార్ధ్ కు క్షమాపణలు చెప్పారు. ‘మనం ఎప్పుడూ ఇతరుల మనోభావాలను గాయపరచకూడదు. కన్నడ చిత్ర పరిశ్రమ తరపున సిద్దార్ధ్ క్షమించండి. మీ కార్యక్రమంలో ఇబ్బంది పెట్టినవారు ఎవరో నాకు తెలియదు. మాకు ఈ ఘటన చాలా బాధ కలిగించింది. ఇలాంటి సంఘటన మరలా పునరావృతం కాదు’ అని శివ రాజ్‌కుమార్ పేర్కొన్నారు.
