Prakash Raj supports Siddharth : కావేరీ వివాదం.. హీరో సిద్దార్ధ్‌కి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్

కావేరీ నదీ జలాల వివాదం సినిమాలపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా 'చిత్త' సినిమా కోసం ప్రెస్‌మీట్ పెట్టిన సిద్దార్ధ్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. దాంతో సిద్దార్ధ్ ప్రెస్‌మీట్ నిలిపివేసారు. దీనిపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Prakash Raj supports Siddharth : కావేరీ వివాదం.. హీరో సిద్దార్ధ్‌కి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజ్

Prakash Raj supports Siddharth

Updated On : September 29, 2023 / 2:17 PM IST

Prakash Raj supports Siddharth : కావేరీ నదీజలాల వివాదం సినిమాలపై కూడా ప్రభావం చూపిస్తోంది. తాజాగా నటుడు సిద్దార్ధ్ ప్రెసె మీట్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. దాంతో సిద్దార్ధ్ ప్రెస్‌మీట్ ఆపేయాల్సి వచ్చింది. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. సిద్దార్ధ్‌కు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేసారు. హీరో సిద్దార్ధ్‌కు సారీ చెప్పారు.

Shivamogga : సినీనటుడు ప్రకాష్ రాజ్ సందర్శన తర్వాత ఆవు మూత్రంతో క్యాంపస్‌ను శుద్ధి చేసిన కళాశాల విద్యార్థులు

బెంగళూరులో సిద్ధార్ధ్ తన ‘చిత్త’ సినిమా ప్రమోషన్ కోసం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసారు. సిద్దార్ధ్ ప్రెస్ మీట్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. ప్రెస్‌మీట్‌లో సిద్దార్ధ్ స్పీచ్ స్టార్ట్ చేస్తుండగా ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని గొడవ ప్రారంభించారు . కావేరీ ఉద్యమానికి మద్దతు తెలపాలని సిద్దార్ధ్‌ని డిమాండ్ చేసారు. వారి నిరసన తీవ్రతరం కావడంతో అందర్నీ క్షమించమని కోరుతూ  సిద్దార్ధ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియాలో సిద్దార్ధ్‌కి మద్దతు పలుకుతూ ట్వీట్ చేసారు.

Chandrayaan 3 : చంద్రయాన్-3 పై పాకిస్తానీ నటి ట్వీట్‌కి నెటిజెన్స్ లైక్స్.. ప్రకాష్ రాజ్ ట్వీట్‌కి కౌంటర్స్..

‘దశాబ్దాల కాలంగా కావేరీ నదీ జలాల సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నేతలను.. కేంద్రం జోక్యం చేసుకోవాలని ఒత్తిడి చేయని పనికిమాలిన పార్లమెంటేరియన్లను ప్రశ్నించండి..సామాన్యులను, కళాకారులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. కన్నడికుడిగా, కన్నడికుల తరపున.. హీరో సిద్దార్థ్ క్షమించండి’ అంటూ ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టారు. ప్రకాష్ రాజ్ పోస్ట్ వైరల్ అవుతోంది.