Karnataka bandh today: కావేరి జల వివాదంపై నేడు కర్ణాటక బంద్…144 సెక్షన్ విధింపు

తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసన తెలపడానికి కన్నడ రైతులు శుక్రవారం కర్ణాటక రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులు బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్ సందర్భంగా మాండ్యా జిల్లాల్లో 144 సెక్షన్ ను విధించారు....

Karnataka bandh today: కావేరి జల వివాదంపై నేడు కర్ణాటక బంద్…144 సెక్షన్ విధింపు

Karnataka bandh today

Karnataka bandh today: తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై నిరసన తెలపడానికి కన్నడ రైతులు శుక్రవారం కర్ణాటక రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులు బంద్ పాటించనున్నారు. ఈ బంద్ సందర్భంగా మాండ్యా జిల్లాల్లో 144 సెక్షన్ ను విధించారు. (Karnataka bandh today) కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. (Section 144 imposed in Mandya district) బెంగళూరులోని బంద్ సందర్భంగా శుక్రవారం పోలీసు సిబ్బందిని మోహరించారు.

Bengal Governor : బెంగాల్ రాజ్‌భవన్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమానం…పోలీసులను తొలగించిన గవర్నర్

కన్నడ అనుకూల రైతు సంఘాలు కావేరి నదీ జలాలను పొరుగున ఉన్న తమిళనాడుకు విడుదల చేయకుండా నిరసన తెలపాలని రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చాయి. (Cauvery river water dispute) రైతుల బంద్ దృష్ట్యా కర్ణాటక పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనకారులు టౌన్ హాల్ నుంచి బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కు వరకు భారీ నిరసన ప్రదర్శన జరిపారు. బంద్ సందర్భంగా రోడ్లపై వాహనాలు, విమానాలను కూడా అడ్డుకుంటామని రైతు సంఘాలు ప్రకటించాయి.

Punjab : పంజాబ్‌లో అకాలీదళ్ నాయకుడి కాల్చివేత

రాజ్ భవన్ ముందు ఆందోళనకారులు నిరసన తెలిపారు. బంద్ నేపథ్యంలో బెంగళూరు నగరంలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బంద్ కు ఆటో సంఘాలు కూడా మద్ధతు ప్రకటించాయి. ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్, ఓలా, ఉబర్ డ్రైవర్లు, కార్ల యజమానుల సంఘం బంద్‌కు మద్ధతు ఇస్తున్నాయని ఆటో సంఘం అధ్యక్షుడు తన్వీర్ పాషా చెప్పారు. అన్ని విద్యా సంస్థలు, ప్రైవేట్ క్యాబ్ సేవలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేశారు.

Vishal : సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన వ్యాఖ్యలు.. మార్క్ ఆంటోని రిలీజ్ అవ్వడానికి లంచం తీసుకున్నారంటూ..

బ్యాంకులు, అంబులెన్సులు, ఫార్మా వాహనాలు, ఆసుపత్రులు,వైద్య దుకాణాలు వంటి అత్యవసర సేవలు అందుబాటులో ఉంచారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కావేరి జల వివాదం కొనసాగుతోంది. కావేరి వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ) కర్ణాటక నుంచి 15 రోజులపాటు తమిళనాడుకు 5000 క్యూసెక్ నీటిని విడుదల చేయాలని కోరింది. కావేరీ పరీవాహక ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదైనందున నీటిని విడుదల చేసే స్థితిలో లేమని కర్ణాటక రైతులు చెబుతున్నారు.