Bengal Governor : బెంగాల్ రాజ్‌భవన్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమానం…పోలీసులను తొలగించిన గవర్నర్

పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమానంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌ మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న బెంగాల్ పోలీసుల భద్రతను తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు....

Bengal Governor : బెంగాల్ రాజ్‌భవన్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమానం…పోలీసులను తొలగించిన గవర్నర్

Bengal governor CV Ananda Bose

Bengal Governor : పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమానంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌ మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న బెంగాల్ పోలీసుల భద్రతను తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. (phone tapping concern) రాజ్‌భవన్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని గవర్నర్ బోస్ ఆదేశించారు. (Bengal governor) కోల్‌కతా పోలీసులు ప్రధాన ప్రవేశ ద్వారాలు, భవనం పక్కనే ఉన్న తోటల వద్ద భద్రతా ఏర్పాట్లను మాత్రమే చూస్తారు. (Raj Bhavans security)

Punjab : పంజాబ్‌లో అకాలీదళ్ నాయకుడి కాల్చివేత

గవర్నర్ తన నివాసంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తన ఇంట్లో ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండవచ్చని సమావేశాల్లో గవర్నర్ బోస్ ఆరోపించారు. గవర్నర్ తన బంగళాలో ఫోన్ ట్యాపింగ్ నుంచి బయటపడటానికి కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

Mynampally Hanumanth Rao : ప్రజలు నాతోనే ఉన్నారు, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే- మైనంపల్లి హనుమంతరావు

గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను కోల్‌కతా మేయర్, సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఫిర్హాద్ హకీమ్ ఖండించారు. గవర్నర్ బోస్ రాజ్యాంగాన్ని అనుసరించకుండా ఢిల్లీ అధికారులను సంతోష పెట్టడానికి డ్రామా ఆడుతున్నారని హకీమ్ ఆరోపించారు.