Kantara producer Vijay Kiragandur comments on kantara movie and international awards
Vijay Kiragandur : రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిలిం నిర్మాణంలో తెరకెక్కిన కాంతార సినిమా కన్నడలో చిన్న సినిమాగా రిలీజయి దేశమంతటా భారీ విజయం సాధించింది. కేవలం 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కన్నడలో రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, మలయాళం, తుళు, హిందీ భాషల్లో రిలీజయి అక్కడ కూడా భారీ విజయం సాధించింది.
కర్ణాటకలోని పంజుర్లి దైవం, అక్కడి వాళ్ళ ఆచారాలతో ముడిపెడుతూ సామాజిక సమస్యలని ప్రశ్నిస్తూ చేసిన సినిమా కాంతార. ఈ సినిమాకి అన్ని చోట్లా ఆదరణ లభించింది. ఇక ఈ సినిమా ఆస్కార్ క్వాలిఫై లిస్ట్ 300 సినిమాల్లో పేరు కూడా సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్ళలేదు. దీనిపై చిత్ర నిర్మాత విజయ్ కిరగందుర్ తాజాగా స్పందించారు.
కాంతార సినిమా ఆస్కార్, గోల్డెన్డ్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ అవార్డుల దాకా వెళ్లకపోవడంపై తాజాగా నిర్మాత విజయ్ మాట్లాడుతూ.. కరోనా సమయం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న నేపథ్య సినిమాలు, సిరీస్ లు చూశారు. దీంతో వారికి కొత్త రకం కంటెంట్ అందించాలి. ఇప్పటి ఫిలిం మేకర్స్ లక్ష్యం అదే. కాంతార, RRR సినిమాల విషయంలో అదే జరిగింది. కాంతార ద్వారా తుళు కల్చర్ ని అంతా తెలుసుకున్నారు. ఇకపై కూడా లాంటి కొత్త కొత్త కథలపై దృష్టి పెడుతున్నాము. కాంతార సినిమా సప్టెంబర్ లో రిలీజయింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల నామినేషన్స్ టైం లోపు ప్రచారం చేయలేకపోయాము. చాలా తక్కువ టైం ఉండటంతో ఎక్కువ ప్రచారం చేయలేకపోయాము. అందుకే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ లాంటి అంతర్జాతీయ అవార్డులకు నామినేట్ అవ్వలేదనుకుంట. ఆ లోటుని కాంతార 2 తీరుస్తుంది. ఆల్రెడీ కాంతార 2 పనులు మొదలయ్యాయి. 2024 చివరి వరకు కాంతార 2 సినిమాని తీసుకొస్తాం. ఆ సినిమాని అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తాం అని అన్నారు.