Nanditha Das : హీరోయిన్ డైరెక్షన్లో డెలివరీ బాయ్‌గా కపిల్ శర్మ
నందిత దాస్ డైరెక్షన్ లో కపిల్ శర్మ యాక్టర్ గా బాలీవుడ్ లో సినిమా చేయనున్నారు. ఇందులో కపిల్ శర్మ ఫుడ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపించనున్నారు. సహానా గోస్వామి హీరోయిన్. తాజాగా.......
- Saketh U
- Published on- February 18, 2022 / 09:41 AM IST
Kapil Sharma
Kapil Sharma : బాలీవుడ్ ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, కమెడియన్ కపిల్ శర్మ ఇప్పుడు మెయిన్ లీడ్ లో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కమెడియన్ గా పలు సినిమాల్లో, షోలలో మెప్పించి, తన కపిల్ శర్మ షోతో ఫుల్ పాపులర్ అయి బాలీవుడ్ లో స్టార్ అయ్యాడు. తాజాగా మెయిన్ లీడ్ గా ఓ సినిమా చేయబోతున్నాడు. హీరోయిన్ నందిత దాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనుంది. వివిధ భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్న నందిత దాస్ అప్పుడప్పుడు సినిమాలు డైరెక్షన్ కూడా చేస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన నందిత దాస్ తాజాగా కపిల్ శర్మని పెట్టి మరో సినిమాని తెరకెక్కించనుంది.
Siddhu Jonnalagadda : విజయ్ దేవరకొండ, అడవి శేష్‌కి వచ్చినట్టు నాకు ఛాన్సులు రాలేదు
నందిత దాస్ డైరెక్షన్ లో కపిల్ శర్మ యాక్టర్ గా బాలీవుడ్ లో సినిమా చేయనున్నారు. ఇందులో కపిల్ శర్మ ఫుడ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపించనున్నారు. సహానా గోస్వామి హీరోయిన్. తాజాగా ట్విట్టర్ లో వీరితో ఉన్న ఫోటోని షేర్ చేసి ‘‘మీ ఆర్డర్ స్వీకరించాం. కపిల్ శర్మ ఎన్నడూ కనపడని ఫుడ్ డెలివరీ బాయ్ పాత్రలో కనిపిస్తారు. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సంవత్సరం ఇదే చాలా పెద్ద ఎగ్జైటింగ్ ప్రాజెక్టు అవుతుంది.” అని పోస్ట్ చేసింది నందిత దాస్.
