Siddhu Jonnalagadda : విజయ్ దేవరకొండ, అడవి శేష్‌కి వచ్చినట్టు నాకు ఛాన్సులు రాలేదు

సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ''ఈ రోజు పెన్ను పవర్‌ గెలిచింది. మిమ్మల్ని నవ్వించడానికి చాలా కష్టపడ్డాం. ఇలాంటి విజయం కోసం చాలాకాలంగా ఎదురు చూశాను. అప్పట్లో ‘గుంటూరు టాకీస్‌’......

Siddhu Jonnalagadda :  విజయ్ దేవరకొండ, అడవి శేష్‌కి వచ్చినట్టు నాకు ఛాన్సులు రాలేదు

Dj Tillu

 

DJ Tillu :  సిద్ధూ జొన్నల గడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కడంతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అయితే బాగా వైరల్ అయ్యాయి. ఇటీవలే వైజాగ్ లో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ ఎప్పట్నుంచో సినిమా ఇండస్ట్రీ లో ఉన్నారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ‘గుంటూరు టాకీస్‌’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినా సిద్ధూ ఫేట్ మారలేదు. ఇటీవల ఓటీటీలో ‘కృష్ణ అండ్‌ హీస్‌ లీల’, ‘మా వింతగాథ వినుమా’ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు. ఈ సినిమాలు ఓటీటీలో మంచి విజయాలు సాధించాయి. అయితే వీటికి రైటర్ గా కూడా పని చేశాడు సిద్ధూ. ఇప్పుడు ‘డీజే టిల్లు’ సినిమాకి కూడా డైలాగ్స్ సిద్ధూనే రాశాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘డీజే టిల్లు’ సక్సెస్ పై మాట్లాడుతూ తన కష్టాలని కూడా తెలిపాడు.

Ajay Devgn : షూటింగ్ మొదలుపెట్టిన హిందీ ‘దృశ్యం 2’

సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ”ఈ రోజు పెన్ను పవర్‌ గెలిచింది. మిమ్మల్ని నవ్వించడానికి చాలా కష్టపడ్డాం. ఇలాంటి విజయం కోసం చాలాకాలంగా ఎదురు చూశాను. అప్పట్లో ‘గుంటూరు టాకీస్‌’ సినిమా మంచి విజయం సాధించింది. కానీ అప్పుడు నాకు ‘పెళ్లి చూపులు’ తర్వాత విజయ్‌ దేవరకొండకు, ‘క్షణం’ తర్వాత అడవి శేష్‌కు వచ్చినట్లు గొప్ప గొప్ప అవకాశాలు రాలేదు. అందుకే నాకు ఇంత గ్యాప్‌ వచ్చింది.” అని తెలిపాడు.

Rakhi Sawant : మొన్నే విడాకులు.. నేడు మంచి ఇల్లు, కారు ఉంటే మళ్ళీ రావొచ్చు అంటూ నటి ప్రకటన

”ఓ సారి నా ఫ్రెండ్‌ను నా కోసం నా సినిమాని ప్రచారం చేయమన్నాను. కానీ అది జరగలేదు. అప్పుడే నిర్ణయించుకున్నాను ఎవరూ మనల్ని పట్టించుకోనప్పుడు మనమే ఒక సంచలనంగా మారాలి అని. అలా అనుకొని సినిమాలు తీస్తున్నాను. నా లాస్ట్ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ‘డీజే టిల్లు’ మాత్రం బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది’’ అని సిద్ధు తెలిపాడు. ఇప్పటికే రెండు సినిమాలు ఓకే చేసిన సిద్ధూ తర్వాత కూడా అతను కోరుకున్నట్టు వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.