Karan Johar : నా లైంగిక సమస్యని షారుఖ్ ఖాన్ అర్ధం చేసుకున్నాడు..
కరణ్ జోహార్ తన లింగత్వం పై ఎప్పటినుంచో పలు కామెంట్స్ ని ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఈ విషయం పై కరణ్ మాట్లాడాడు.
- gum 95921
- Published On : October 26, 2023 / 12:20 PM IST
Karan Johar opens up about his sexuality with Shah Rukh Khan
Karan Johar : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించిన ఏదో విషయం నెట్టింట వైరల్ అవుతుంటుంది. తాజాగా ఈ దర్శకనిర్మాత ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహార్ తన లింగత్వం పై ఎప్పటినుంచో పలు కామెంట్స్ ని ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఈ విషయం పై కరణ్ మాట్లాడాడు.
కరణ్ చేసిన కామెంట్స్.. “నాలోని స్త్రీ లింగత్వం బయటకి ఎక్కువుగా కనిపిస్తుంటుంది. దీని పై జనాలు జోక్స్ వేస్తూ మాట్లాడుతుంటారు. నేను పెద్దవాడిని అయ్యే సమయంలో ఆ కామెంట్స్ కొంత తగ్గాయి. కానీ నా నడక, మాటలు చూసి నా వెనుక కొత్త చర్చ అయితే జరుగుతుంది. ఈ విషయంలో షారుఖ్ ఖాన్ నాకు హెల్ప్ చేశాడు. నన్ను అర్ధం చేసుకున్న మొదటి వ్యక్తి తను. నేను నేనుగా ఫీల్ అయ్యేలా చేశాడు. నా లైంగిక సమస్య గాని, ఏదైన పెద్ద సమస్య ఎదురైనా గాని నేను ఫోన్ చేసే మొదటి వ్యక్తి షారుఖ్ ఖాన్” అంటూ పేర్కొన్నాడు.
Also read : Pooja Hegde : రేంజ్ రోవర్ కారు కొన్న పూజా హెగ్డే.. ఎన్ని కొట్లో తెలుసా..?
ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ కాంబినేషన్ లో అనేక సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కరణ్ జోహార్ దర్శకత్వంలో షారుఖ్ నటించిన ‘కుచ్ కుచ్ హోతా హాయ్’, ‘కభీ ఖుషి కభీ ఘమ్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమా తరువాత షారుఖ్ మరోసారి కరణ్ దర్శకత్వంలో నటించలేదు.
