Pooja Hegde : రేంజ్ రోవర్‌ కారు కొన్న పూజా హెగ్డే.. ఎన్ని కొట్లో తెలుసా..?

రేంజ్ రోవర్‌ కారు కొన్న పూజా హెగ్డే. ఈ కారుతో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన నెటిజెన్స్.. ఆ కారు ఖరీదు ఎంత ఉంటుంది అని సెర్చ్ చేస్తున్నారు.

Pooja Hegde : రేంజ్ రోవర్‌ కారు కొన్న పూజా హెగ్డే.. ఎన్ని కొట్లో తెలుసా..?

Pooja Hegde buy Range Rover car photo gone viral

Updated On : October 26, 2023 / 11:08 AM IST

Pooja Hegde : టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ.. అక్కడే అవకాశాలు కోసం చూస్తుంది. దీంతో ప్రస్తుతం అక్కడే ఉంటుంది. అయితే ఆమె చేస్తున్న హిందీ ప్రాజెక్ట్స్ పై కూడా సరైన సమాచారం లేదు. ఇటీవలే షాహిద్ కపూర్ పక్కన ఒక సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, పూజా హెగ్డేకి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫొటోలో పూజా రేంజ్ రోవర్‌ కారుతో కనిపిస్తుంది.

తాజాగా ఈ భామ రేంజ్ రోవర్ SUVని కొనుగోలు చేసిందట. గ్రెయ్ కలర్ షేడ్ తో కారు అదిరిపోయింది. ప్రస్తుతం పూజ ఈ కారుతో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన నెటిజెన్స్.. ఆ కారు ఖరీదు ఎంత ఉంటుంది అని సెర్చ్ చేస్తున్నారు. ఆ కారు ఖరీదు సుమారు నాలుగు కోట్లు అని సమాచారం. కాగా పూజా హెగ్డే దగ్గర ఆల్రెడీ పోర్షే కయెన్, జాగ్వార్, ఆడి క్యూ7 మరియు మరెన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు గ్యారేజ్ లో ఆ కార్లు పక్కన ఈ రేంజ్ రోవర్ కూడా చేరింది.

Also read : Manikanta : అనాథలను దత్తత తీసుకుంటాను.. గొప్ప మనసు చాటుకున్న ఢీ డాన్స్ మాస్టర్..

ఇక పూజా మూవీస్ విషయానికి వస్తే.. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ అంటూ సౌత్ సినిమాలకు సైన్ చేయడం లేదని టాక్ వినిపిస్తుంది. అక్కడైనా ప్రాజెక్ట్స్ చేస్తుందా అంటే.. పెద్దగా ఏం కనిపించడం లేదు. రీసెంట్ గా షాహిద్ కపూర్ సరసన ‘దేవా’ అనే సినిమాకి సైన్ చేసింది. నిన్ననే ఈ మూవీ షూటింగ్ మొదలయింది. 2024 దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. పూజా బాలీవుడ్ లో చేసిన గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి. మరి ఈసారైనా హిట్ అందుకుంటుందా లేదా చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by ? Pooja ? (@hegdepoojjaa)