Manikanta : అనాథలను దత్తత తీసుకుంటాను.. గొప్ప మనసు చాటుకున్న ఢీ డాన్స్ మాస్టర్..

రాఘవ లారెన్స్ ని అమితంగా అభిమానించే మణికంఠ.. ఏకలవ్యుడిగా తన గురు నుంచి డాన్స్ ని మాత్రమే కాదు అతని సేవ గుణాన్ని కూడా అందుకున్నాడు.

Manikanta : అనాథలను దత్తత తీసుకుంటాను.. గొప్ప మనసు చాటుకున్న ఢీ డాన్స్ మాస్టర్..

Dhee dance coreographer Manikanta helping poor people and orphans

Manikanta : ఢీ డాన్స్ షోతో ఎంతోమంది కళాకారులు తమ టాలెంట్ ని బయటపెట్టి ఇటు పరిశ్రమలో అవకాశాలు, అటు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇక తమకి వచ్చిన ఫేమ్ ని తమ భవిషత్తుకి ఉపయోగించుకుంటూనే నలుగురికి సహాయ పడుతున్నారు కొంతమంది డాన్సర్స్. వారిలో ఒకరు మణికంఠ. సౌత్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ని అమితంగా అభిమానించే మణికంఠ.. ఏకలవ్యుడిగా తన గురు నుంచి డాన్స్ ని మాత్రమే కాదు అతని సేవ గుణాన్ని కూడా అందుకున్నాడు.

తాజాగా మణికంఠ విజయనగరం జిల్లాలోని భోగాపురం గ్రామంలో ఒక డాన్స్ ప్రోగ్రాంకి వెళ్లారు. అక్కడ నృత్య ప్రదర్శన ఇచ్చిన తరువాత మణికంఠ అక్కడి గ్రామా ప్రజలకి ఒక సందేశం ఇచ్చాడు. “మీ గ్రామంలో ఎవరైనా అనాథ పిల్లలు, పేదరికరం వలన చదువుకోలేని పిల్లలు, లేదా డబ్బులేక వైద్యం చేయించుకోలేని వారు ఉంటే నాకు తెలియజేయండి. నేను వారికీ సహాయం చేస్తాను” అంటూ మణికంఠ గ్రామా ప్రజలకి తెలియజేశాడు. మణికంఠ చేసే ఈ పని పై అభిమానులు, ప్రేక్షకులు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

Also read : Anchor Suma : విలేకర్లు, యాంకర్ సుమ మధ్య గొడవ.. సారీ చెప్పిన వీడియో వైరల్..

మణికంఠ ఈ ఒక్కసారి మాత్రమే కాదు. తాను చేసే ప్రతి ప్రోగ్రాంకి వచ్చే సంపాదనలో 20 శాతం పేదలకు ఉపయోగిస్తుంటాడు. ఎవరికైన సహాయం కావాలంటే తనని సంప్రదించమని మణికంఠ కొన్ని నెంబర్స్ కూడా షేర్ చేశాడు. రాఘవ లారెన్స్ తన సంపాదనతో అనాథ పిల్లలకు, పేదలకు ఎంతో సహాయం చేస్తుంటాడు. తన వీరాభిమాని అయిన మణికంఠ కూడా అదే దారిలో ప్రయాణించడం ప్రశంసలు వచ్చేలా చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Manikanta Dancer (@manikanta._official)