×
Ad

Jeh : బాల నటుడిగా కరీనా రెండో కుమారుడు..!

తమ చిన్న కుమారుణ్ణి బాలనటుడిగా వెండితెరకు పరిచయం చెయ్యబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు కరీనా..

  • Published On : August 18, 2021 / 05:13 PM IST

Jeh

Jeh: కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ జంటకు తైమూర్ అలీ ఖాన్, జెహ్ అనే ఇద్దరు కుమారులున్న సంగతి తెలిసిందే. తైమూర్‌ను ఫస్ట్ నుండి మీడియా ముందుకు తీసుకు రావడం, అతని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటడం చేసే ఈ బాలీవుడ్ కపుల్ రెండో కుమారుడికి సంబంధించిన ఫొటోలవీ బయటపెట్టడానికి ఎందుకో ఇష్టపడలేదు.

Kareena Kapoor – Saif Ali Khan: కరీనా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సెక్స్ డ్రైవ్ గురించి బుక్‌లో..

కట్ చేస్తే.. ఇటీవల సైఫ్ మొదటి భార్య కూతురు సారా అలీ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా, ఫ్యామిలీతో కలిసి ఉన్న జెహ్‌ని ఆడియెన్స్‌కి పరిచయం చేసింది. ముద్దులొలికే చిన్నారి జెహ్ పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు తమ చిన్న కుమారుణ్ణి బాలనటుడిగా వెండితెరకు పరిచయం చెయ్యబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు కరీనా.

Kareena Saif’s Flat: అద్దెకు కరీనా, సైఫ్ దంపతుల పాత ఇల్లు.. అద్దె ఎంతంటే?

ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో జెహ్ కొన్ని సీన్లతో పాటు ఓ రొమాంటిక్ సాంగ్‌లోనూ నటించనున్నాడట. జెహ్ ఈ ఏడాది ఫిబ్రవరి 21న జన్మించాడు. నెలల వయసులోనే బాలనటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ తో టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు.

Pooja Hegde : కరీనాకు పూజా పాప సపోర్ట్..