Kareena Kapoor – Saif Ali Khan: కరీనా ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సెక్స్ డ్రైవ్ గురించి బుక్‌లో..
బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ కరీనా కపూర్.. తన ప్రెగ్నెన్సీ సమయంలో జరిగిన విషయాలన్నింటి గురించి బుక్ రిలీజ్ చేశారు. కరోనా ప్యాండమిక్ కావడంతో రీసెంట్ గా సోమవారం (ఆగష్టు 9)న అఫీషియల్ లాంచింగ్ చేశారు.
- Subhan Ali Shaik
- Updated on- August 23, 2021 / 07:24 PM IST
Saif Ali Khan Kareena Kapoor
Kareena Kapoor – Saif Ali Khan: బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ కరీనా కపూర్.. తన ప్రెగ్నెన్సీ సమయంలో జరిగిన విషయాలన్నింటి గురించి బుక్ రిలీజ్ చేశారు. కరోనా ప్యాండమిక్ కావడంతో ముందుగా వర్చువల్ పద్ధతిలో సోషల్ మీడియాలో రిలీజ్ చేసినప్పటికీ.. రీసెంట్ గా సోమవారం (ఆగష్టు 9)న అఫీషియల్ లాంచింగ్ చేశారు.
ఈ సందర్భంగా లైవ్ లో.. ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ‘మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మూడ్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి మిగతావాళ్లు అలాగే ఫీల్ అవుతారనుకోవద్దు. అది చాలా ముఖ్యం. కొన్ని రోజులు నాకు నేను చాలా అందంగా, సెక్సీగా అనిపించేదాన్ని. అదే విషయం సైఫ్ ను అడిగితే.. అవును నిజమే అనే వాడు’
ఏడెనిమిది నెలలు వచ్చేసరికి.. నిద్రలేవాలంటే ఏదో చికాకుగా ఉండేది.
‘కొన్నిసార్లు వికర్షణగా అనిపించొచ్చు. అది కేవలం మీ మానసిక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే మీకు సపోర్టివ్ వ్యక్తి అయి ఉండాలి. చాలా మంది తమ భార్యలపై ఒత్తిడి పెట్టాలనుకోరు. వాళ్లు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా అందంగా ఉండాలంటూ ఇబ్బందిపెట్టరు. తక్కువ చేసి చూడరు. నిజానికి అలాంటి ఒత్తిడి ఉండకూడదు. రెగ్యూలర్ సెక్స్ లైఫ్ అనేది సూపర్ యాక్టివ్ గా ఉండాలి’ అని లైవ్ సెషన్ లో చెప్పారు.
