బికినీ వేసుకుంటే: నెటిజన్‌పై హీరోయిన్ ఆగ్రహం

  • Publish Date - March 13, 2019 / 07:10 AM IST

సెలబ్రీటీలు అయితే వాళ్లు ఎలా ఉండాలో చెప్పేందుకు నెటిజన్లకు హక్కుందా? ఈ ప్రశ్న వేస్తుంది ఎవరో కాదు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్.. ఇటీవల కరీనాకపూర్ తన భర్త సైఫ్ అలీఖాన్ పక్కన బికినీతో నిల్చొని ఉన్న ఫోటోను సైఫ్ అలీఖాన్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసుకున్నాడు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ కరీనా కపూర్ బికినీ వేసుకునేందుకు ఎందుకు ఒప్పుకుంటున్నావ్ అంటూ సైఫ్ అలీఖాన్‌ను దూషిస్తూ  కామెంట్ పెట్టాడు. సదరు కామెంట్‌పై ఓ వెబ్ సిరీస్ షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న కరీనా కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also : Kurkure బ్రాండ్ అంబాసిడర్ సమంత : ట్విట్టర్‌లో నెటిజన్ల విమర్శలు

కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అర్బాజ్ ఖాన్ కామెంట్‌ను చదివి వినిపించగా.. తనను బికినీ వేసుకోకుండా అడ్డుకోవడానికి సైఫ్ అలీఖాన్ ఎవరు..? అంటూ కరీనా కపూర్ ప్రశ్నించింది. నువ్వు బికినీ వేసుకోవద్దు? ఎందుకు అలా చేస్తున్నావు అంటూ సైఫ్ ఎప్పుడూ తనని ప్రశ్నించరని, తమ బంధం అలాంటిది అంటూ కరీనా చెప్పాంది. తమ ఇద్దరి మధ్య బాధ్యతాయుతమైన బంధం ఉందని, తనపై సైఫ్‌కి పూర్తి నమ్మకం ఉందని, బికినీ వేసుకుంటే అందుకు కారణం ఉంటుందని, స్విమ్మింగ్ చేసుందుకు బికినీ వేసుకున్నానని ఆమె వెల్లడించింది. ఐదేళ్ల క్రితం సైఫ్‌తో కరీనా పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. 2012 అక్టోబర్ 16న వారిద్దరూ వివాహం చేసుకున్నారు.