Karthi Japan First look poster released
Karthi Japan : తమిళ హీరో కార్తీ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘సర్దార్’ సినిమాలతో వరుసగా సూపర్ హిట్లు అందుకుని దూసుకుపోతున్నాడు. కెరీర్ మొదటి నుంచి వైవిదైమైన కథలో నటిస్తూ వచ్చే కార్తీ.. తాజా చిత్రాలు పొన్నియన్ లో పోరాట యోధుడిగా, సర్దార్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్పై గా నటించి అదరహో అనిపించాడు. పొన్నియన్ సెల్వన్-2 షూటింగ్ కూడా పూర్తీ చేసుకున్న ఈ హీరో తన తదుపరి సినిమాను కూడా ట్రాక్ ఎక్కించేశాడు.
Karthi : నా పేస్‌బుక్ అకౌంట్ హాక్ అయ్యింది.. కార్తీ ట్వీట్!
ఇటీవలే పూజా కారిక్రమాలు నిర్వహించుకున్న ఈ సినిమాకు ‘జపాన్’ అనే వెరైటీ టైటిల్ ని పెట్టారు. తాజాగా నేడు మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. పోస్టర్ బట్టి చూస్తే ఇది మాఫియా కామెడీ కథాంశంతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కార్తీ జపాన్ అనే ఒక చలాకి డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కార్తీ ఈ పాత్రను పరిచయం చేస్తూ.. “జపాన్ మేడ్ ఇన్ ఇండియా. ఈ టిపికల్ రోల్ చేయడానికి చాలా ఎదురుచూస్తున్న” అంటూ ట్వీట్ చేశాడు.
కార్తీ 25వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. సునీల్ కి ఇది మొదటి తమిళ స్ట్రెయిట్ ఫిల్మ్. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Excited to start this journey of a quirky guy! #Japan – Made in India.#JapanFirstLook pic.twitter.com/gBStwdetkY
— Karthi (@Karthi_Offl) November 14, 2022