కార్తీ, జ్యోతిక, సత్యారాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ సినిమాకు ‘తంబి’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల కానుంది..
తమిళ యంగ్ హీరో కార్తీ, తన కెరీర్‌లో మొట్టమొదటి సారిగా వదిన జ్యోతికతో కలిసి నటిస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను హీరో సూర్య శుక్రవారం రిలీజ్ చేశారు. మలయాళీ దర్శకుడు, ‘దృశ్యం’ ఫేమ్.. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.
వయాకామ్ 18 స్టూడియోస్ సమర్పణలో, పారాలాల్ మైండ్స్ ప్రొడక్షన్స్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ్‌లో ‘తంబి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం కింగ్ నాగార్జున తెలుగు, సూర్య తమిళ్, మోహన్ లాన్ మలయాళ టీజర్ రిలీజ్ చేయనున్నారు.
Read Also : హ్యాపీ బర్త్‌డే థమన్ – ‘ఓ బావా’ సాంగ్ ప్రోమో
ఇటీవలే ‘ఖైదీ’గా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తీ, మరోసారి ‘దొంగ’ అంటూ మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ వాడుకోవడం విశేషం. డిసెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి, ‘96’ ఫేమ్ గోవింద్ వసంత మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
Here’s the first look of #Thambi #Donga #Jo & @Karthi_offl ‘s exciting next! #SurajSadanah ‘s debut production ??#JeethuJoseph #Sathyaraj @Viacom18Studios @ParallelMinds_ @govind_vasantha @AndhareAjit @rdrajasekar @Nikhilavimal1 #ThambiFirstLook #ThambiTeaserFromTomorrow pic.twitter.com/qNAeHrtzsH
— Suriya Sivakumar (@Suriya_offl) November 15, 2019