Pawan Kalyan : పండగ పూట పవన్ కళ్యాణ్ కొత్త ప్రయాణం.. స్టార్ ప్రొడ్యూసర్ తో కలిసి..
తాజాగా భోగి పండగ పూట పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కొత్త విషయాన్ని ప్రకటించింది.

పవన్ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై హీరోగా సినిమాలు చేస్తానో లేదో తెలీదు కానీ సినిమాల్లో మాత్రం ఉంటా. నిర్మాతగా సినిమాలు చేస్తాను అని ప్రకటించారు. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సర్దార్ గబ్బర్ సింగ్, చల్ మోహన్ రంగ సినిమాలు నిర్మించారు పవన్.

ఇటీవలే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని మళ్ళీ యాక్టివ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా భోగి పండగ పూట పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కొత్త విషయాన్ని ప్రకటించింది.

పవన్ కళ్యాణ్ తనకు క్లోజ్ పర్సన్, జనసేనకు ఎంతగానో సపోర్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తో కలిసి సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కలిసి సినిమాలు నిర్మిస్తామని భోగి సందర్భంగా ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.

దీనిపై విశ్వప్రసాద్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ గారితో సినిమా కథలు డిస్కస్ చేసి ఆయన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో కలిసి సినిమాలు నిర్మించే అవకాశం ఇచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను అని తెలిపారు.
