అభిమాని మరణం – కార్తి కన్నీటి పర్యంతం

తనను ఎంతగానో ప్రేమించేఅభిమాని మరణాన్ని తట్టుకోలేక తమిళ హీరో కార్తి కన్నీటి పర్యంతమయ్యాడు..

  • Publish Date - November 30, 2019 / 08:19 AM IST

తనను ఎంతగానో ప్రేమించేఅభిమాని మరణాన్ని తట్టుకోలేక తమిళ హీరో కార్తి కన్నీటి పర్యంతమయ్యాడు..

సినిమా హీరోలకు అభిమానులే కొండంత అండ.. అభిమానులే వారి బలం.. తనను ఎంతగానో ప్రేమించే అభిమాని మరణాన్ని తట్టుకోలేక తమిళ హీరో కార్తి కన్నీటి పర్యంతమయ్యాడు. అతడి భౌతిక కాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. 

కార్తి ప్రస్తుతం వదిన జ్యోతికతో కలిసి నటించిన ‘తంబి’ (తెలుగులో దొంగ) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా ఆడియో లాంచ్‌ కార్యక్రమం చెన్నైలోని సత్యం సినిమాస్‌లో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకకు హాజరు కావడానికి ముందే కార్తికి తన వీరాభిమాని వ్యాసై నిత్య మరణించాడనే చేదు వార్త తెలిసింది.

వెంటనే అతని ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమయ్యాడు కార్తి. వ్యాసై కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ‘కార్తి మక్కల్‌ నాలా మండ్రం’ పేరిట ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన వ్యాసై అంటే కార్తికి కూడా ఎంతో అభిమానం.