Kajal Agarwal: కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంట్.. దేవుడి దయవల్ల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్

స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) పేరు కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తనకు ఎదో యాక్సిడెంట్ అయ్యిందని, ఈ ప్రమాదంలో ఆమె కారు నుజ్జు నుజ్జు అయ్యిందని వార్తలు వైరల్ అయ్యాయి.

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ కి యాక్సిడెంట్.. దేవుడి దయవల్ల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్

Kajal Agarwal responds to her accident rumors

Updated On : September 9, 2025 / 6:54 AM IST

Kajal Agarwal: స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పేరు కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తనకు ఎదో యాక్సిడెంట్ అయ్యిందని, ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు నుజ్జు నుజ్జు అయ్యిందని, తీవ్రగాయాలతో ఆమె హాస్పిటల్ లో చేరారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమెకు ఎం జరగకూడదు, క్షమింగా ఉండాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

Manchu Manoj: మీరున్నంత వరకూ నాకేం కాదు.. మిరాయ్ ఈవెంట్ లో మంచు మనోజ్

అయితే, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న యాక్సిడెంట్ వార్తలపై హీరోయిన్ కాజల్(Kajal Agarwal) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “నాకు యాక్సిడెంట్ జరిగిందని, నేను ఇక లేను అంటూ నిరాధారమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి నా దృష్టికి వచ్చాయి. ఆవార్తల్లో ఎలాంటి నిజం లేదు. అది చూసి నేను కూడా షాక్ అయ్యాను. ఆ దేవుడి దయ వల్ల నేను బాగున్నాను. సురక్షితంగానే ఉన్నాను. ఎలాంటి ఫేక్ న్యూస్ లను నమ్మొద్దని కోరుతున్నాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎవరిపైనా చేయకండి అంటూ నేను దయతో ప్రార్థిస్తున్నాను. ప్రేమతో మీ కాజల్” అంటూ రాసుకొచ్చారు. దీతో కాజల్ యాక్సిండెంట్ పై వచ్చిన తప్పుడు ప్రచారాలకు చెక్ పడింది.

ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న కాజల్ పెళ్లి తరువాత సినిమాలు తగ్గించారు. ఇటీవల ఆమె బాలకృషతో భగవంత్ కేసరి సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ, ఈ సినిమా తరువాత మరో సినిమా చేయలేదు కాజల్ అగర్వాల్.