Atharva Review : క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘అథర్వ’ ఎలా ఉంది.. థియేటర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిందా..?

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన 'అథర్వ' సినిమా.. థియేటర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిందా..?

Karthik Raju Simran Choudhary suspense thriller movie Atharva Review

Atharva Review : సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలకు ఆడియన్స్ లో ఎప్పుడు ఆసక్తి నెలకుంటుంది. ఆ నేపథ్యంలో చిన్న సినిమా వచ్చినా, పెద్ద సినిమా వచ్చినా ఆడియన్స్ చూడడానికి ముందు ఉంటారు. ఈ నేపథ్యంతోనే నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘అథర్వ’. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించగా ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ దుహన్ సింగ్, మరిముత్తు, ఆనంద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

కథ విషయానికొస్తే..
హీరో అథర్వ (కార్తీక్ రాజు) పోలీస్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటాడు. అందుకోసం ఎంతో కష్టపడతాడు. అయితే తనకి ఉన్న ‘ఆస్తమా’ సమస్య వల్ల పోలీస్ సెలక్షన్స్ లో ఫెయిల్ అవుతాడు. అలా ఫెయిల్ అయిన హీరోకి ఒక పోలీస్ ఓ సలహా ఇస్తాడు. క్లూస్ అండ్ ఫోరెన్సిక్ విభాగంలో ట్రై చెయ్యి అని చెబుతాడు. దీంతో హీరో అటువైపుగా అడుగులు వేసి క్లూస్ టీంలోకి అడుగు పెడతాడు. అక్కడ మొదటి కేసులోనే తన ప్రతిభ చూపిస్తాడు.

ఇంతలో హీరోయిన్ (సిమ్రాన్ చౌదరి) ఎంట్రీ ఇస్తుంది. ఆల్రెడీ వీరిద్దరికి గతంలో ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ ఉంటుంది. ఈ ఇద్దరి లవ్ స్టోరీ మళ్ళీ మొదలయ్యి సాగుతున్న సమయంలో ఒక మర్డర్ జరుగుతుంది. టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ నటిస్తున్న ఒక నటి (ఐరా) చనిపోతుంది. ఆమెను తన ప్రియుడే చంపేసి, అతను కూడా చనిపోయినట్లు ఆధారాలు బట్టి తెలుస్తుంది. అయితే దానిని అథర్వ నమ్మడు. అక్కడి నుంచి తన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ తరువాత ఏమైంది..? అసలు హీరో పోలీస్ అవ్వాలని అని ఎందుకు గట్టిగా కోరుకున్నాడు..? అనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాలి.

Also read : Animal Movie Review : యానిమల్ మూవీ రివ్యూ.. నాన్న ఎమోషన్‌కి మాస్ జోడించి ఏడిపించిన సందీప్ వంగా..

సినిమా విశ్లేషణ..
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్ పై చాలా సినిమాలు వచ్చాయి. అయితే దాదాపు అన్ని సినిమాలు పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఈ సినిమా కథ కోసం క్లూస్ అండ్ ఫోరెన్సిక్ విభాగ కోణాన్ని ఎంచుకోవడం అనేది ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా అథర్వ పోలీస్ అవ్వాలి, క్లూస్ టీంలో జాయిన్ అయిన తరువాత కేసు సాల్వ్ చేయాలి, లవ్ స్టోరీతో నార్మల్ గానే సాగుతుంది. సెకండ్ హాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది.

హీరోయిన్ హత్యని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రియుడే నేరస్తుడంటూ క్లోజ్ చేసేస్తుంది. కానీ అథర్వ మాత్రం ఆ మర్డర్ మిస్టరీ కనిపెట్టే ప్రయత్నంలో ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినా సరే అథర్వ ఆ మర్డర్ మిస్టరీని చేధించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు..? దానికి తన గతానికి ఏంటి సంబంధం అనేది కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. తరువాత ఏం జరుగుతుంది. ఎవరు అసలు నేరస్తుడు అని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.

నటీనటుల విషయానికి వస్తే..
కథ మొత్తం అథర్వ పాత్ర కార్తీక్ రాజు చుట్టూనే తిరుగుతుంది. చంటిఅబ్బాయి సినిమాలో చిరంజీవిలా.. ఈ సినిమాలో కూడా హీరో పాత్రతోనే కామెడీ చేయించారు. కామెడీ, ఫైట్స్, కేసుని సాల్వ్ చేసే ఫోరెన్సిక్ ఆఫీసర్ గా ఇంటెన్స్ యాక్టింగ్ తో ఓవర్ అల్ గా కార్తీక్ రాజు ఆడియన్స్ ని మెప్పించారు. ఇక సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, మరిముత్తు, ఆనంద్.. తమతమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ..
ఫస్ట్ హాఫ్ నార్మల్ స్టోరీతో అక్కడ అక్కడ బోర్ కలిగించినా, సెకండ్ హాఫ్ మాత్రం ఇంటరెస్టింగ్ గా సాగింది. అయితే ఎండింగ్ మాత్రం సడన్ గా ఇచ్చేసినట్లు ఉంటుంది. అసలు నేరస్తుడు ఎవరని తెలియజేసేదే ఇంకొంచెం ఎఫక్టీవ్ గా చూపించి ఉంటే బాగుండేది అనిపించింది. మూవీ ఎండింగ్ లో సెకండ్ పార్ట్ కి కూడా హింట్ ఇస్తూ చూపించిన ఒక సీన్ ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఆ ఒక్క సీన్ సీక్వెల్ పై ఆసక్తిని కలగజేస్తుంది. మొత్తం మీద సినిమాని ఆడియన్స్ అంచనా వేయని రీతిగా నడిపించారు. 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ, రేటింగ్ వీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు