కరోనా దెబ్బకు ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో షూటింగులు మొత్తం ఆగిపోయాయి. డైలీ సీరియళ్లు షూటింగ్‌లు ఆగిపోవడంతో ప్రస్తుతం ప్రసారం చెయ్యాడానికి ఎపిసోడ్‌లు లేక పాత సీరియళ్లనే తిప్పి మళ్లీ వేస్తున్నాయి టీవీ ఛానెళ్లు.. ఇటువంటి సమయంలో సీరియళ్ల అభిమానులకు నెటిజన్లు చేస్తున్న విజ్ఞప్తులు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. మెమీస్ ట్రోల్స్ సీరియళ్లపై నవ్వు తెప్పిస్తున్నాయి.
లేటెస్ట్‌గా తెలుగులో సూపర్ హిట్ సీరియల్ అయిన ‘కార్తీక దీపం’పై వస్తున్న ట్రోల్స్ అయితే నవ్వు తెప్పించడమే కాదు.. ఆలోచింపచేసేవిగా కూడా ఉన్నాయి. ‘కార్తీకదీపం’ సీరియల్ ప్రసారం కాకపోవడంతో నిరాశగా ఉన్నా మహిళా అభిమానులను ఉద్దేశిస్తూ నెటిజన్లు చేస్తున్న మెమీస్ ఆకట్టుకుంటున్నాయి. నీ ఇంట్లో నువ్వు కూర్చుని తింటూ దేశాన్ని కాపాడుతున్న టైమ్‌లో వంటలక్క దూరమవ్వడం బాధాకరమే అంటూ మెమీస్‌తో నవ్వు పుట్టిస్తున్నారు నెటిజన్లు.
సీరియల్ నిలిపివేయడంతో కార్తీకదీపం ఫ్యాన్స్ వంటలక్క కోసం ఎదురు చూస్తుండగా.. వంటలక్క డాక్టర్ బాబుని కలుస్తుందా?? చిచ్చర పిడుగులు సౌర్య, హిమలు డాక్టర్ బాబు, వంటలక్కల్ని కలుపుతారా? మౌనిత కుట్రలకు సౌందర్య ఎలా కళ్లెం వేస్తుంది? లాంటి ఉత్కంఠ కలిగించే విషయాలతో ఉన్న కార్తీకదీపం సీరియల్ మళ్లీ ఎప్పుడు ప్రసారం అవుతుంది. అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయా ఛానెళ్లను అడుగుతున్నారు.
ఈ క్రమంలో అయ్యో అని బాధ పడేవాళ్లను.. వంటలక్కనే ఉపయోగించి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి సైతం వాడేస్తూ మీమ్స్ క్రియేట్ చేసి నవ్వులు పూయిస్తున్నారు. వంటలక్క చేతులు జోడించి.. ‘నేను డాక్టర్ బాబు కలిసే సీన్ మీరు చూడాలని లేదా?? అలా చూడలంటే మీరు బతికి ఉండాలిగా.. అందుకే ఇంకొన్నాళ్లు ఓపిక పట్టి, ఇంటి పట్టునే ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి’ అంటూ వంటలక్క చెప్తున్నట్టుగా ఉన్న మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read | విశాఖలో కోలుకున్న కరోనా రోగి..ఆరుగురు నర్సులకు సోకిన వైరస్