తమిళ స్టార్ హీరో, సూర్య తమ్ముడు కార్తీ తెలుగులో కూడా మార్కెట్‌ను బాగా పెంచుకుంటున్నారు. ఇటీవల ఖైదీ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ని అలరించగా.. ఈ సినిమాకి కార్తీకి మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలోనే కార్తీ లేటెస్ట్‌గా మరో సినిమాను కూడా తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు.
కనకరాజు దర్శకత్వంలో కార్తీ నటించిన ‘ఖైదీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకోగా ఇప్పుడు తన తర్వాత సినిమాకి తెలుగులో తమ్ముడు అనే పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. చిరంజీవి కెరీర్‌లో సూపర్ హీట్ సినిమాగా నిలిచిన ఖైదీ సినిమా పేరే తన సినిమాకు పెట్టుకుని హిట్ కాగా.. ఇప్పుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన తమ్ముడు సినిమా పేరును ఈ సినిమాకు పెట్టాలని ఆలోచిస్తుందట చిత్రయూనిట్.
జ్యోతిక – కార్తి అక్కాతమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు వెర్షన్‌కు ‘తమ్ముడు’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కథ రీత్యా సినిమాకు ఇదే పెడితే సరిగ్గా సరిపోతుందరి చిత్ర యూనిట్ భావిస్తుంది. మరి అన్న పేరు కలిసొచ్చినట్టు, తమ్ముడు పేరు కూడా కలిసొస్తుందో లేదో చూడాలి.