భూల్ భూలైయా 2 – ప్రారంభం

కార్తీక్ ఆర్యన్, కియారా అద్వాణీ జంటగా నటిస్తున్న ‘భూల్ భూలైయా 2’ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. 2020 జూలై 31న రిలీజ్..

  • Publish Date - October 9, 2019 / 11:22 AM IST

కార్తీక్ ఆర్యన్, కియారా అద్వాణీ జంటగా నటిస్తున్న ‘భూల్ భూలైయా 2’ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.. 2020 జూలై 31న రిలీజ్..

అక్షయ్ కుమార్, విద్యా బాలన్ నటించగా సూపర్ హిట్ అయిన ‘భూల్ భూలైయా’ సినిమాకు సీక్వెల్‌గా ‘భూల్ భూలైయా 2’ రూపొందుతుంది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వాణీ జంటగా నటిస్తున్నారు. టీ-సిరీస్, సినీ 1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

‘నో ఎంట్రీ’, ‘వెల్‌కమ్’, ‘రెడీ’, ‘ముబారకన్’ వంటి పలు హిట్ చిత్రాలను తెరకెక్కించిన అనీస్ బజ్మీ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘భూల్ భూలైయా 2’ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్లపై ఫస్ట్ షాట్ చిత్రీకరించారు. మూవీ యూనిట్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Read Also : ఆయుధపూజ చేశాడు – నెటిజన్లు ఆడుకుంటున్నారు!

కార్తీక్ ఆర్యన్ గెటప్ చూస్తే ‘భూల్ భూలైయా’లో అక్షయ్ గుర్తొస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2020 జూలై 31న ‘భూల్ భూలైయా 2’ రిలీజ్ చెయ్యనున్నారు. రైటింగ్ : ఫర్హాద్ సామ్‌జీ, ఆకాష్ కౌషిక్, నిర్మాతలు : భూషణ్ కుమార్, మురాద్ ఖేతానీ, కృష్ణ కుమార్.