×
Ad

Kartik Aryan : అమ్మ క్యాన్సర్ ని గెలిచింది.. బాలీవుడ్ స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్

కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా అతను చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.

  • Published On : May 6, 2023 / 07:18 AM IST

Kartik Aryan emotional tweet on his mother goes viral

Kartik Aryan :  బాలీవుడ్(Bollywood) యువ హీరో కార్తీక్ ఆర్యన్(Kartik Aryan). ఇటీవల భూల్ భూలయ్య 2(Bhool Bhulaiyaa2) సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. మన అలవైకుంఠపురంలో(Ala Vaikuntapuramlo) సినిమాను హిందీలో ‘షెహజాదా’గా(Shehzada) రీమేక్ చేశాడు కార్తీక్ ఆర్యన్. కార్తీక్ కు బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కార్తీక్ ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా అతను చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.

తాజాగా కార్తీక్ ఆర్యన్ తన తల్లితో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. కొన్ని రోజుల క్రితం మా కుటుంబంలోకి క్యాన్సర్ ప్రవేశించింది. మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నించింది. కానీ అమ్మ మాత్రం నిరుత్సాహపడకుండా ధైర్యంగా పోరాడి క్యాన్సర్ పై గెలిచింది. ఎప్పుడూ దేనికి ఓడిపోకూడదనే ఆమె మనస్తత్వమే ఆమెను క్యాన్సర్ ని జయించేలా చేసింది. కుటుంబం ప్రేమ, మద్దతు కంటే గొప్పది ఇంకోటి లేదు అని పోస్ట్ చేశాడు. అమ్మ క్యాన్సర్ వారియర్ అంటూ ట్వీట్ చేశాడు.

Anasuya : మళ్లీ ట్విట్టర్ లో రచ్చ మొదలుపెట్టిన అనసూయ.. రౌడీ హీరోని టార్గెట్ చేసి ట్వీట్.. ఆడుకుంటున్న నెటిజన్లు..

దీంతో కార్తీక్ ఆర్యన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పలువురు అభిమానులు, నెటిజన్లు కార్తిక్ తల్లిని అభినందిస్తూ, కార్తిక్ ని ధైర్యంగా ఉండమని పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు.