Karunamaya : ‘కరుణామయ’ కొత్త సినిమా ఓపెనింగ్.. క్రిస్మస్ కి రిలీజ్..

రిలీజ్ డేట్ తో సినిమా మొదటి పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. (Karunamaya)

  • Published on- July 15, 2026 / 05:25 PM IST

Karunamaya

Karunamaya : జోష్, ఖలేజా.. లాంటి అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన చైతన్య శక్తి ఇప్పుడు హీరోగా కరుణామయ అనే సినిమాతో రాబోతున్నాడు. ఆరాధ్య హైందవి సమర్ఫణలో బాబీ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్. 1గా సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మాణంలో హర్షవర్దన్ పారెళ్ళ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. స్వాతి శ్రీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్, వీ.ఎన్ ఆదిత్య గెస్టులుగా హాజరయ్యారు. వివి వినాయక్ స్క్రిప్ట్ అందించారు. రిలీజ్ డేట్ తో సినిమా మొదటి పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

Also Read : Allu Arjun Basil Joseph : బన్నీ – బసిల్ జోసెఫ్ సినిమా టైటిల్ అదేనా..? ఈ దెబ్బతో మలయాళ ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయం..

మూవీ ఓపెనింగ్ అనంతరం నిర్మాత సంకాబత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం అన్నారు. దర్శకుడు హర్షవర్దన్ పారెళ్ళ మాట్లాడుతూ.. తండ్రీకొడుకు ఎమోషన్స్ తో ఫ్యామిలీ సినిమాగా మా ‘కరుణామయ’ సినిమా ఉండబోతుంది. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. పగలు రాత్రి తేడా లేకుండా టీం మొత్తం కష్టపడతాం అని తెలిపారు.

హీరో చైతన్య శక్తి మాట్లాడుతూ.. కరుణామయ సినిమాలో నేను హీరోగా చేస్తున్నాను. ఇంత మంచి కథలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ అని తెలిపారు.